Advertisement
Google Ads BL

సినీజోష్‌ ఇంటర్వ్యూ: సిద్ధార్థవర్మ


 ‘3జి లవ్‌’తో పరిచయమై మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థవర్మ ఇప్పుడు హీరోగా బిజీగా అవుతున్నారు. 3జి లవ్‌ తర్వాత నేను నా ఫ్రెండ్స్‌లో ఓ ప్రధాన పాత్ర పోషించిన సిద్ధార్థ లేటెస్ట్‌గా ఉషాకిరణ్‌ మూవీస్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దాగుడు మూతలు దండాకోర్‌’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తన కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటూ హీరోగా తన గోల్‌ రీచ్‌ అవ్వడానికి కృషి చేస్తున్న సిద్ధార్థ వర్మ పుట్టినరోజు జనవరి 26. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్ధార్థవర్మ తను చేస్తున్న చిత్రాలు, ఫ్యూచర్‌లో చేయబోతున్న ప్రాజెక్ట్స్‌ గురించి వివరించారు. 

Advertisement
CJ Advs

మీ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి?

బిఎస్‌సి కంప్లీట్‌ చేసిన నాకు చిన్నప్పటి నుంచి మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని, హీరో అవ్వాలని కోరిక వుండేది. అయితే ప్రతి ఫ్యామిలీలోనూ ఇలాంటి ఆలోచన చేస్తే ఎంకరేజ్‌ చెయ్యరు. మా ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా మొదట అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత నాకు వున్న ఇంట్రెస్ట్‌ని చూసి ఓకే చెప్పారు. నేను కూడా ఒక సంవత్సరం వారి దగ్గర టైమ్‌ తీసుకున్నాను. ఈ సంవత్సరంలో ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్‌ చేసుకుంటానని చెప్పాను.

3జి లవ్‌లో అవకాశం ఎలా వచ్చింది?

మొదట 3జి లవ్‌ ఆడిషన్స్‌కి వచ్చాను. నన్ను సెలక్ట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత నాకు నటనలో ట్రైనింగ్‌ కూడా వారే ఇచ్చారు. నిర్మాత ప్రతాప్‌ కోలగట్లగారు నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేశారు. నా వెన్నంటి వుండి నాకు ఎంతో ధైర్యం చెప్పారు. ఆయన నాకు దేవుడితో సమానం. 

‘దాగుడు మూతలు దండాకోర్‌’ చిత్రానికి ఎలా సెలెక్ట్‌ అయ్యారు?

ఈ సినిమాకి కూడా ఆడిషన్స్‌కి వెళ్ళాను. ఆ ఆడిషన్‌లో నన్ను సెలెక్ట్‌ చేశారు. ఆ తర్వాత క్రిష్‌గారు నాకు ఎంతో సపోర్ట్‌గా వున్నారు. అక్కడ కూడా నాకు చాలా విషయాల్లో ప్రాక్టీస్‌ ఇచ్చారు. షూటింగ్‌ టైమ్‌లో కూడా ఆయన నాతో వుండి నేను బాగా పెర్‌ఫార్మ్‌ చెయ్యడానికి తోడ్పడ్డారు. టోటల్‌గా ఈ సినిమా 28 రోజుల్లో పూర్తి చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. రాజేంద్రప్రసాద్‌గారులాంటి సీనియర్‌ ఆర్టిస్ట్‌తో కలిసి నటించడం నా అదృష్టంగా భావించాను. ఆయన దగ్గర కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. 

మీ కెరీర్‌ ఎలా వుందనిపిస్తోంది?

నేను కోరుకున్న విధంగా సినిమాల్లో నటిస్తున్నాను. హీరోగా బిజీగా వున్నాను. నా కెరీర్‌లో మంచి సినిమాలు చేస్తూ మంచి నటుడుగా పేరు తెచ్చుకోవాలని వుంది. నాకు వచ్చే ఆఫర్స్‌ కూడా మంచి బేనర్స్‌ నుంచి, మంచి డైరెక్టర్స్‌ నుంచి రావడం కూడా నాకు చాలా ప్లస్‌ అవుతోంది. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌లో బి.జయగారి దర్శకత్వంలో బి.ఎ.రాజుగారు నిర్మించే చిత్రంలో హీరోగా నటిస్తున్నాను. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్‌ చెయ్యలేదు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. 

మీ పుట్టినరోజు సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? 

నేను ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి ప్రతాప్‌ కోలగట్లగారు నాకు అందించిన ప్రోత్సాహమే కారణం. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా ప్యామిలీ మెంబర్స్‌ కూడా నాకు ఎంతో సపోర్ట్‌గా వున్నారు.  అలాగే నేను నా ఫ్రెండ్స్‌ డైరెక్టర్‌ జి.ఎస్‌.రావుగారు కూడా నన్ను ఎంతో ఎంకరేజ్‌ చేశారు. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్‌ చెప్తున్నాను. ఇకముందు కూడా మంచి మంచి సినిమాలు చేసి అందర్నీ అలరించాలన్నది నా కోరిక అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో సిద్ధార్థవర్మ

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs