ఇ.వి.వి సత్యన్నారాయణ కొడుకుగా సుపరిచితమై హీరోగా తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు ఆర్యన్ రాజేష్. 'హాయ్','సొంతం', 'ఎవడి గోల వాడిదే' వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. హీరోగా కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్ గా 'బందిపోటు' సినిమా తో మన ముందుకు వస్తున్న ఆర్యన్ రాజేష్ తో సినీజోష్ ఇంటర్వ్యూ...
- ప్రొడ్యూసర్ గా మొదటి సినిమా 'బందిపోటు' ఎలా అనిపించింది?
ప్రొడ్యూసర్ గా ఉండడం కంటే యాక్టింగ్ చేయడం చాలా ఈజీ. సినిమా చేస్తున్నంత సేపు చాలా టెన్షన్ పడ్డాను.ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ నెల 27 న సెన్సార్ పూర్తి చేసి ఫిబ్రవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.
- నాన్నగారి తరువాత ఈ బ్యానర్ లో మీరు చేసిన మొదటి సినిమా ఎలా ఉండబోతోంది?
ఇ.వి.వి బ్యానర్ లో ఒక మంచి సినిమా తెరకెక్కించాలని భావించాం. ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమా నుంచి ఖచ్చితంగా కామెడి ఎక్స్ పెక్ట్ చేస్తారు. కామెడి జోనర్ లోనే ఈ సినిమాను కూడా నిర్మించాం. నరేష్ నటించిన కొన్ని సినిమాలు చూస్తే పేరడీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమా లో ఎలాంటి పేరడీ లేకుండా విభిన్నంగా నిర్మించాం. అంతే కాకుండా ప్రతీ సంవత్సరం ఈ బ్యానర్ లో ఒక సినిమా నిర్మించాలని అనుకుంటున్నాం. అందులో హీరో నరేష్ అనే కాకుండా అందరి హీరోలతో చేస్తాం.
- ఈ చిత్రాన్ని ఎలా నిర్మించారు?
ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ విషయం లోనూ కాంప్రమైస్ అవ్వలేదు. 10 కోట్ల బడ్జెట్ అయింది. క్వాలిటీలో అంతా పర్ఫెక్ట్ గా చేసాం. ఈ సినిమా లో నాలుగు పాటలు ఉన్నాయి. రెండు పాటలను విదేశాలలో తీసాం. సిట్యువేషన్ డిమాండ్ చేయడం వల్లే ఐటెం సాంగ్ పెట్టాము.
- నరేష్ సినిమాలో సంపూర్నేష్ బాబు అవసరమా?
కామెడి యాడ్ చేయడానికే సంపూర్నేష్ ని సెలెక్ట్ చేసాం. ఈ సినిమాలో ఆయనది లెంగ్దీ క్యారెక్టర్. ప్రతీ సన్నివేశంలో ఆయన కనిపిస్తారు. రావు రమేష్, పోసాని, భరణి మంచి పాత్రలలో నటించారు.
- నరేష్ మీరు కలిసి నటించే ఆలోచన ఏమైనా ఉందా?
బ్రదర్ క్యారెక్టర్స్ కి సరిపడా కథ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నటిస్తాం.
- నరేష్ డైరెక్టర్ గా ఎప్పుడు పరిచయం అవబోతున్నాడు?
హీరో గా నరేష్ కెరీర్ బాగానే సాగుతుంది. 5 లేదా 6 సంవత్సరాలు తరువాత తను దర్శకునిగా పరిచయం అవుతాడు.
- డైరెక్టర్ ఇంద్రగంటి తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ వంటి క్లాస్ మూవీస్ చేసిన ఇంద్రగంటి గారితో కలిసి క్లాస్ కామెడి మూవీని వర్కవుట్ చేసాం. సినిమా అంటే రెండు రకాలు. మంచి సినిమా, కమర్షియల్ సినిమా. 'బందిపోటు'ను ఖచ్చితంగా మంచి సినిమాగా చెప్పుకుంటారు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.