Advertisement
Google Ads BL

సినీజోష్‌ ఇంటర్వ్యూ: కిషోర్‌కుమార్‌ పార్థసాని


‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో దర్శకుడుగా పరిచయమై ఆ తర్వాత నాగచైతన్య, సునీల్‌తో ‘తడాఖా’తో మరో సూపర్‌హిట్‌ సాధించిన దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ). లేటెస్ట్‌గా డాలీ దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘గోపాల గోపాల’. వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌ హీరోలుగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌ కిశోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ)తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

Advertisement
CJ Advs

‘గోపాల గోపాల’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా చూసి సినిమా బాగుందని చెప్పడం నేను చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యాను. నాకు వచ్చిన కాల్స్‌లో బెస్ట్‌ కాల్‌ సీతారామశాస్త్రిగారి నుంచి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీలో 53 మంది సినిమా చూడడానికి వెళ్లారట. సినిమా చూసి వచ్చిన తర్వాత శాస్త్రిగారు ఎలా వుందని అడిగారట. చిన్న పిల్లల నుంచి 70 ఏళ్ళ వయసు వారి వరకు సినిమా చాలా బాగుందని చెప్పారట.

తెలుగు వెర్షన్‌లో ఎలాంటి మార్పులు చేశారు?

హిందీ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ, క్లైమాక్స్‌ నాకు అంతగా నచ్చలేదు. హీరోకి పెరాలసిస్‌ వచ్చిందంటే అది ఎవరి వల్ల వచ్చింది. దేవుడు వచ్చి హీరోకి భగవద్గీత ఇచ్చి అతనికి ఓ దారి చూపించినవాడు అతనికి పెరాలసిస్‌ వచ్చేలా ఎందుకు చేస్తాడు. దాన్ని ఛేంజ్‌ చెయ్యాలనుకున్నాను. భక్తులు బాబాలను, స్వామీజీలను గుడ్డిగా నమ్ముతారు. అందులో మంచివారు వున్నారు, చెడ్డవారు వున్నారు. చెడ్డవారి గురించి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. కొంతమంది స్వామీజీలను జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసిన సందర్భాలు మనం విన్నాం. వాళ్ళు నమ్మిన స్వామీజీ ఏది చేసినా కరెక్టే అని వారి ఉద్దేశం. తాను నమ్మిన స్వామీజీని బోనెక్కించడం ఒకడికి కోపం తెప్పించింది. దాంతో క్లైమాక్స్‌లో హీరోని పొడిచినట్టు మార్పు చేశాం.

పవన్‌కళ్యాణ్‌ని దేవుడు క్యారెక్టర్‌ కోసం తీసుకోవాలన్న నిర్ణయం ఎవరిది?

అది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం. దేవుడంటే ఎలా వుంటాడు అనేది ఎన్‌.టి.రామారావుగారిని చూసి ఫిక్స్‌ అయి వున్నాం. దేవుడి పాత్ర చెయ్యాలంటే అతనికి చాలా మంచి ఇమేజ్‌ వుండాలి. అలాంటి ఇమేజ్‌ పవన్‌కళ్యాణ్‌లో వుందని మేం ఫీల్‌ అయ్యాం.

సబ్జెక్ట్‌ విషయంలో హీరోల ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఎంత వరకు వుంది?

అలాంటిది లేదండీ. ఈ కథ తీసుకున్న తర్వాత ఆరు నెలల పాటు నేను, భూపతిరాజా, దీపక్‌రాజ్‌ స్క్రిప్ట్‌ మీద వర్క్‌ చేసి కొన్ని మార్పులు చేశాం.

ఈ విజయం మీకెలాంటి సంతృప్తినిచ్చింది?

నా విక్టరీ ఈ సినిమా కలెక్షన్స్‌, గొప్పగా ఆడడం కాదు. ప్రేక్షకులకు ఏదైతే కన్వే చేద్దామనుకున్నానో అది హండ్రెడ్‌ పర్సెంట్‌ రీచ్‌ అయింది. అది రియల్‌ సక్సెస్‌గా నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను వెరీ హ్యాపీ. 

ఈ సినిమా చేసే అవకాశం మీకెలా వచ్చింది?

వెంకటేష్‌గారికి ఈ సినిమా చెయ్యాలని ఎప్పటి నుంచో వుంది. ఈ సినిమా రిలీజ్‌ అయినపుడు నేను షూటింగ్‌లో బిజీగా వున్నాను. డైరెక్ట్‌గా థియేటర్‌లో ఈ సినిమా చూడలేదు. ఒకసారి టి.వి.లో వస్తుంటే చూసి షాక్‌ అయ్యాను. వెంటనే డి.వి.డి. తెప్పించుకొని మళ్ళీ మళ్ళీ చూశాను. ఇది వండర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ అనిపించింది. యాక్చువల్‌గా నాతో వేరే సినిమా చేద్దామనుకున్నారు వెంకటేష్‌గారు. కానీ, ఈ స్క్రిప్ట్‌ బాగుంది అనుకున్న తర్వాత ఇదే చెయ్యాలని డిసైడ్‌ అయ్యాము. 

డైలాగ్స్‌కి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?

ఈ సినిమాకి సాయిమాధవ్‌ అద్భుతమైన డైలాగ్స్‌ రాశారు. మరో విషయం ఏమిటంటే రైటర్‌ అయినా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయినా వారి నుంచి నేను కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. ఏ పాయింట్‌లో సాయిమాధవ్‌ ఇబ్బంది పడకుండా ఎన్ని వెర్షన్స్‌ రాయమంటే అన్ని వెర్షన్స్‌ ఎలా కావాలంటే అలా రాశారు. అందులో బాగా సూట్‌ అయ్యేవి సెలెక్ట్‌ చేసి తీసుకున్నాం. ఇప్పుడు డైలాగ్స్‌కి థియేటర్‌లో మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

అనూప్‌ మ్యూజిక్‌ సినిమాకి ఎంతవరకు హెల్ప్‌ అయింది?

అనూప్‌ కూడా ఒక రకంగా సాయిమాధవ్‌లాగే చాలా ట్యూన్స్‌ చేసి ఇచ్చారు. అల్టిమేట్‌గా ట్యూన్‌ వుంది అనే వరకు చేశారు. నాకు హండ్రెడ్‌ పర్సెంట్‌ నచ్చేవరకు ట్యూన్స్‌ చేశారు. ఎప్పుడైనా మ్యూజిక్‌ డైరెక్టర్‌ కావాల్సినంత టైమ్‌ ఇవ్వగలిగితే ఔట్‌పుట్‌ కూడా అంత బాగా వస్తుందనేది నా నమ్మకం. 

మీ నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

పవన్‌కళ్యాణ్‌గారి కోసం సబ్జెక్ట్‌ రెడీ చెయ్యాల్సి వుంది. ఇప్పుడు గోపాల గోపాల ప్రమోషన్‌ వర్క్‌ జరుగుతోంది కదా. ఇది పూర్తయిన తర్వాత ఆ సబ్జెక్ట్‌ మీద వర్క్‌ చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు కిశోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ).

 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs