>పవన్ కళ్యాణ్ మునిసిపోల్ శంఖారావం
వినవచ్చిన వార్త - వివరించిన నిజం
''ఆంధ్రాలో చంద్రబాబు తెలంగాణాలో బి.జె.పి. సభ్యత్వాల నమోదు ! హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు పవన్ కళ్యాణ్ 'జన సేన' ముస్తాబు.''
వినవచ్చిన వార్త -
2019 ఎన్నికలకు ముందు - అటు తెలంగాణ ఇటు ఆంధ్రా లో - రాజకీయం వేడెక్కుతుంది. నిన్నటివరకు ఆంధ్ర సి. మ్. చంద్రబాబు - 2019 ఎన్నికలతో తెలంగాణ కూడా మన టి. డి.పి. అని పదే పదే ప్రకటించారు. ఈ మధ్య చంద్ర బాబు ప్రకటనల జోరు తగ్గింది. చేతల మనిషి బి. జె.పి. - జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వడివడి గా పావులు కదుపుతున్నారు. తెలంగాణ 70 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడానికి గ్రాస్ రూటు - బూతు స్థాయి నాయకత్వాన్నితయారు చేస్తున్నారు. ఈ నీపద్యంలో పవన్ 'జన సేన' ప్రకటనలకే పరిమితమా? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నికలనాటివరకు పవన్ సినిమాలు చేసుకుంటాడని, ఎన్నికలముందు సీట్ల సర్దుబాట్లు సరిచేసుకుంటాడని రాజకీయ విశ్లేషకులు సెటైర్ పేలుస్తున్నారు. వారి కామెంట్స్ కి మెతమెతగా తనదైన స్టైల్ లో, 'గోపాల గోపాల' ఆడియో ఫంక్షన్ లో సమాధానమిచారు. ''కొన్నిసార్లు రావడం లేటవ్వవచ్చేమో గాని రావడం ఖాయం''
- క్రియాశీల రాజకీయాలలోకి రావడం ఖాయం, రాజకీయ సమీకరణాలు, తన పని ఒతిడి వళ్ళ కొన్ని సందర్భాలలో లేటవ్వవచ్చు - అని నర్మగర్భంగా సమాధానమిచారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ మునిసిపల్ ఎలక్షన్ లో పవన్ 'జన సేన' శంఖారావం పూరించడం ఖాయమని రాజకీయ పండితుల విశ్లేషణ. అందుకు తగ్గట్టుగా తన కాన్సెప్ట్ సరి చేసుకుంటాడని కూడా వీరు అంటున్నారు. ''గోపాల గోపాల'' ఆడియో ఫంక్షన్ లో తన అభిమానులను అలరించాడానికే ప్రయత్నించడం జరిగింది.
>వివరించిన నిజం :
''లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తా ...''
''సింహం ఒంటరిగా వస్తుంది; పందులే గుంపులు గుంపులుగా వచ్చేది''
- రజనీకాంత్ హిట్ సంభాషణలు.
ఆ ట్రెండ్ లోనే పవన్ కూడా ''కొన్నిసార్లు రావడం లేటవ్వవచ్చేమో గాని రావడం ఖాయం'' అని ''గోపాల గోపాల'' ఆడియో ఫంక్షన్ కి ఆలస్యంగా రావడానికి గల కారణం చెప్పారు. చాల కాజువల్ గ అన్న పవన్ మాటలకు రాజకీయ మిత్రులు రకరకాల కామెంట్స్ జోడించడం విశేషం.
- - తోటకూర రఘు
Advertisement
CJ Advs