ఎస్సీ ,ఎస్టీ మహిళల పెళ్ళికి చంద్రబాబు 'చదివింపు' 50 వేలు!
>బ్రాహ్మణులు 'పెళ్లి' చేయడానికేనా? పెళ్లి జేసుకోవడానికి కాదా?
'అగ్రకులాలు'గా చెప్పబడుతున్న చాలా కులాలలో
అర్థాకలితో కాలం వెళ్ళబుచ్చుతున్న కుటుంబాలు లక్షల
సంఖ్యలో! 'ఇంటింటి సర్వే' పేరుతో ఈ అభాగ్యుల జాబితా
కూడా తయారు చేసి ఆర్థికంగా ఆదుకోవడానికి
ప్రణాళికలు సిద్ధంచేస్తున్న ఒకే ఒక్కడు ఈ దేశంలో
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్
ఎస్సీ/ ఎస్టీ మహిళల పెళ్ళికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 50 వేల రూపాయలు 'చదివించడం' అభినందనీయం ; ఆమోదయోగ్యం ! కానీ పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక సతమతమవుతున్న తల్లితండ్రులు బ్రాహ్మణులు తదితర కుటుంబాలలో కూడా వున్నారు. పెళ్ళికి అందించే ఆర్థికసాయం వారి ఆర్ధిక పరిస్థితిపై ఆధారపడివుండాలి. ప్రసిద్ధ దేవాలయాలకు, నదీ తీర ప్రదేశాలకు, అగ్రహారాలకు వెళ్లి చూడండి. గుళ్ళో అధికారికంగా పూజలు చేసే పూజారులకు సహాయకులుగా కొందరు; దోష నివారణకు జపతపాలు చేయించడానికి మరికొందరు; తద్దినాలు పెట్టించడానికి ఇంకొందరు - ఇలా రకరకాలుగా ఆ రోజు భుక్తి కోసం వేయికళ్ళతో ఎదురు చూసే పండితులు వేల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలో కనిపిస్తారు.. బ్రాహ్మణులు అంటే ఉన్నతులు. ఎందులో ? అంటే సంస్కారంలో, చదువులో నిన్నటివరకు. కానీ చదువు 'కొనే' ఈ వ్యవస్థలో - ఈ పోటీ ప్రపంచంలో వెనుకబడిపోవడానికి కారణం : వారి పేదరికం. జన్మతహ సంక్రమించిన వర్ణం వలన వారికి విద్యాలయాలలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేవు. కేవలం ప్రతిభతోనే రానించాలి. ఒకప్పుడు రాజులు, జమిందార్లు మణులు, మాణ్యాలు ఇచ్చారట! ఇప్పుడు గత చరిత్ర మినహా ఏ ఆనవాళ్ళులేవు. వాడవాడల్లో బ్రాహ్మణవాడల్లో అర్ధాకలితో కాలంగడుపుతున్న 'శంకరాభరణం శంకరశాస్త్రి'లు ఎందరో తారసపడతారు.
ఈ పరిస్థితి బ్రహ్మనులలోనే కాదు; అన్ని కులాల్లో వుంది. కాకపోతే రాజకీయ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల స్థాయిలో వీరి సంఖ్య లేదు. అంతే!! అందుకే పేద అగ్ర కులాలవారు తమ పిల్లలకి ఒంటినిండా దుస్తులు, కడుపునిండా తిండి, వారి స్థాయికి తగ్గ చదువులు ఇవ్వలేక తల్లడిల్లుతున్నారు. మంత్రి పదవులను చూడండి; ప్రభుత్వ కార్యాలయాలను చూడండి - ఉన్నతాసనాలలో ఎవరున్నారో తెలుస్తుంది!
కుటుంబానికి ఆ పూట భోజనం సంపాదించడానికి ఉదయానేలేచి జపతపాలు పూర్తి చేసుకొని నుదుట తిలకధారణతో దేవాలయాలవద్ద, నదీ తీరాలలో నిలబడ్డ పండితుని ఆకలిని అర్ధంజేసుకునే నాధుడులేకపోవచ్చు. కనీసం ఆడపిల్ల పెళ్లి 'చదివింపు' దగ్గరయినా ఆ పిల్ల ఆర్ధిక స్తోమతని గమనించండి; సాయం అందించండి! అన్ని కులాలలో పేదలలో కడుపేదలున్నారు. వారికి ఆర్ధికఫలాలు అందాలి. లబ్ధిదారుల పట్ల ఆక్షేపణ, అక్కసు లేవు; దాహార్తుల పట్ల ఆవేదన వుంది! నా ఈ వేదన ఏ ఒక్క కులం గురించోకాదు. అడుగంటిపోతున్న విచక్షణా జ్ఞానాన్ని గురించే; ఓటు బ్యాంకు రాజకీయాల గురించే!
విద్య - ఉపాధి విషయంలో చేయగలిగిందేమీలేదు, కనీసం పెళ్ళి 'చదివింపు'ల విషయంలోనైనా పెద్ద మనసు చేసుకోండి మహాశయా!
-తోటకూర రఘు
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads