మరో నాలుగు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో గెలిచే ప్రయత్నంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు... అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంగళవారం హోంమంత్రి తానేటి వనితపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి జరిగింది. అది ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలపైనే అని వైసీపీ నేతల వాదన.
అదే రోజు విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైయస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేసారు. అంతకుముందు కూడా మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడులు చేయడం సిగ్గుచేటు అంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బుధవారం కూడా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్య పై టీడీపీ వారు దాడి చేసారు. ఇవన్నీ టీడీపీ ఓడిపోతుంది అనే అక్కసుతోనే వారు వైసీపీ మహిళలపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ నేతలు టీడీపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.