అధికార పక్షం మీద ప్రతి పక్షం, ప్రతి పక్షం మీద అధికార పక్షం కామెంట్స్ చెయ్యడం సహజం. ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకోవడం అనేది జగమెరిగిన సత్యం. సోషల్ మీడియాలో కొంతమంది కావాలనే అధికార పక్షంపై దొంగ ప్రచారాలు చెయ్యడం, దానిని మీమ్స్ గా మార్చి ట్రెండ్ చెయడమనేది చాల నేరం, ఘోరమైన విషయం.
ఎపిలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సోషల్ మీడియాలో ఇలాంటివి ఎన్నో కనబడుతున్నాయి.వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అన్నట్టుగా ప్రవర్తించడం కాదు ఒక్కోసారి దిగజారిపోయి పోస్ట్ లు పెడుతున్నారు. టీడీపీ కి మద్దతుగా నిలిచే మీడియా ఛానల్స్ తో పాటుగా సోషల్ మీడియాలోనూ జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోయి పోస్ట్ లు పెట్టేవారు ఎక్కువయ్యారు. మీడియా మ్యానేజ్మెంట్ కాదు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మ్యానేజ్ చేయడానికి సిద్ధం అయ్యారు.
- 1.5 లక్షల WhatsApp Groups
- 500 సోషల్ మీడియా పేజస్ (FB, Insta, Twitter and YouTube)
- 2.5 లక్షల మందితో Mana TDP అప్లికేషన్
ఇవి కేవలం తప్పుడు ప్రచారాలు, అధికారంలో ప్రభుత్వం పై, జగన్ పై మీద మోర్ఫెడ్ పిక్స్, Memes, తప్పుడు సర్వేలు.. చేయించడం అన్యాయం, ఇది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.