Advertisement
Google Ads BL

విలువైన భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చూసిన బాబు


చంద్రబాబు ప్రభుత్వంలో హయాంలో 2003 లో ఐఎంజీ భారతకు ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హై కోర్టు స్పష్టం చేసింది. 

Advertisement
CJ Advs

ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు.

ఐఎంజీ భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా దానికి అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు.

క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది.

ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుండగా.. ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వంలు జారీచేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి 2004 వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి స్టేటస్ కో లో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్పులు జారీ చేసింది.

2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది.

Chandrababu:

IMG
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs