Advertisement
Google Ads BL

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ బాబే


వేమూరి హరికృష్ణకు బాబు వత్తాసు

Advertisement
CJ Advs

అస్మదీయుడు అయితే చాలు అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో తనది మాస్టర్‌మైండ్‌ అని బాబు మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంటారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ లో ఫైబర్‌నెట్‌ అవినీతి పర్వం అందుకు ఓ మచ్చుతునక మాత్రమే. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ను తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి పాల్పడ్డ బాబుపై సీఐడీ కన్నేసింది. ఫైబర్‌ నెట్‌ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఏ1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏ2గా టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ వేమూరి హరికృష్ణ, ఏ3గా ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌, ఇన్‌క్యాప్‌ సంస్థలకు అప్పటి ఎండీ కోగంంటి సాంబశివరావు(  ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా ఉన్నారు)లతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై ఐపీసీ సెక‌్షన్లు 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్‌ విత్‌ 120(బి)లతోపాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక‌్షన్లు 13(2), రెడ్‌ విత్‌ 13(1)(సి)(డి)  ప్రకారం కేసు నమోదు చేసింది. 

బాబు పన్నాగం ప్రకారమే...

టెరాసాఫ్ట్‌ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్‌నెట్‌ ప్రాజెక్ట్‌ను కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం రూ.2 వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో రూ.333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగించారు. విద్యుత్‌, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ విద్యుత్‌, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ  ద్వారా ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు. అంతేకాదు...

పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధంగా..

చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించేసారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్‌ను ఏపీ ఈ-గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యునిగా నిబంధనలను విరుద్ధంగా ఆయన్ని ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు అనే ఆరోపణలు ఉన్నాయి. 

ప్రాజెక్ట్‌ విలువ అమాంతంగా పెంచేసి మరీ...

ఎలాంటి మార్కెట్‌ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్ట్‌ కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్ట్‌ విలువను అమాంతంగా పెంచేశారు. వేమూరి హరికృష్ణ, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ అప్పటి ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు.

బ్లాక్‌ లిస్ట్‌ నుంచి తొలగించి..

ఇక ఈ ప్రాజెక్ట్‌ టెండర్ల ప్రక్రియ చేపట్టేనాటికి టెరాసాఫ్ట్‌ కంపెనీ ప్రభుత్వ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈపోస్‌ యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టింది. కానీ బాబు ఆ కంపెనీని బ్లాక్‌ లిస్టు నుంచి తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టేశారు. దీనిపై పేస్‌ పవర్‌ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సం‍స్థలను కూడా సాంకేతిక కారణాలతో టెరాసాఫ్ట్‌కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి.సుందర్‌ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తరువాత కూడా టేరాసాఫ్ట్‌ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్‌ సాధించేందుకుగాను వివిధ పత్రాలను ట్యాంపర్‌ చేశారు. 

ప్రాజెక్ట్‌ అమలు లోపభూయిష్టం

ఇక ప్రాజెక్ట్‌ను అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్‌ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80 శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్‌ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్, ఫ్యూచర్‌ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ, తుమ్మల గోపీచంద్, రామ్‌కుమార్‌ రామ్మూర్తిలతో కలసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే మ్యాన్‌పవర్‌ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్‌ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టుకు సిబ్బందిని సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. 

ఆధారాలతోసహా బట్టబయలు

ఫైబర్‌నెట్‌ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్‌ ఏజెన్సీ ఐబీఐ గ్రూప్‌ ద్వారా ఆడిటింగ్‌ జరపడంతో అవినీతి మొత్తం బయటపెట్టింది. టెరాసాఫ్ట్‌ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబీఐ గ్రూప్‌ నిర్ధారించింది. ఫైబర్‌ నెట్‌ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలంగా వ్యవమరించారని వారు సెక‌్షన్‌  164 సీఆర్‌పీసీ ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Chandrababu:

Fibernet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs