Advertisement
Google Ads BL

మీడియా అక్కసుపై జగన్ తీవ్ర ఆగ్రహం


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ చేసింది. 400 కోట్ల రూపాయలతో ఇంతటి భారీ విగ్రహాన్ని జగన్ prabhutvam ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 18.81 ఎకరాల్లో స్మృతివనం,కన్వెన్షన్ సెంటర్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసింది.అవిష్కరణ సభ కూడా ఎంతో ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిష్ఠా కార్యక్రమంలో సీఎం వైయస్ చేసిన ప్రసంగం ఆలోచనాత్మకంగా ఉంది. ఒకనాడు మానసమాజంలో ప్రబలంగా ఉండే అంటరానితనం ఇప్పుడూ ఉంది.. కాకుంటే అది రూపు మార్చుకుంది.. వేరే రూపంలో అది సమాజాన్ని కాల్చుకుతింటోంది అంటూ సీఎం వైయస్ జగన్ ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

పేదలు చదివే స్కూళ్లను పట్టించుకోకపోవడం అంటరానితనమే... పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకోవడం కూడా అంటరానితనమే.. పేదలు ప్రయాణించే ఆర్టీసీని .. పేదప్రజలు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రులను నిర్వీర్యం చేయడం కూడా అంటరానితనమే అంటూ రాష్ట్రంలో పెత్తందారి వ్యవస్థను ఆయన ఎండగట్టారు. అంతేకాదు పేద పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తుంటే వికృత వార్తలు రాయడం అంటరానితనమే

.. మీడియా సంస్థలు ఈ వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదగడాన్ని సహించడంలేదు. పేద పిల్లలు ఎప్పటికీ పనివాళ్లుగా ఉండిపోవాలా? ఇలాంటి ఆలోచనలు కూడా అంటరానితనమే అని చెప్పవచ్చు అంటూ ఎల్లో మీడియా రాస్తున్న రాతలపై ఆయన విరుచుకుపడ్డారు. 

ఇకమీదట వారి పోకడలు చెల్లవు.. మీకోసం నేనున్నాను.. మీకు అండగా నేనుంటాను.బడుగు వర్గాల కోసం సామాజిక న్యాయ మహా శిల్పం కింద మహనీయుడు అంబేదర్కర్ విగ్రహాన్ని ఏర్పాటు  చేసుకున్నామని అణగారిన వర్గాలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. అయితే ఇలాంటి కార్యక్రమాన్ని కొన్ని మీడియా ప్రసారం చేయకపోగా, కార్యక్రమం పై విమర్శలకు దిగింది. తప్పుడు రాతలు రాసింది. అగ్ర మీడియా అని చెప్పుకునే కొన్ని మీడియా సంస్థలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను టెలికాస్ట్ చేయలేదు. దీనిపై దళితులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక మహోయోధుడికి సంబందించి కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయకపోవడం దళితులను అవమానించడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jagan:

Media 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs