మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో నిన్న జనవరి 12 న విడుదలైన గుంటూరు కారం ఏ ఓటిటిలో వస్తుంది.. అనేది టైటిల్ కార్డ్స్ లోనే రివీల్ చేసేసారు. రమణగాడిగా మహేష్ లుక్స్ కి, మహేష్ యాక్టింగ్ కి ఫిదా అవుతున్న యుత్, అమ్మాయిలు మొదటిసారి ఆయన ఎనర్జిటిక్ స్టెప్స్ కి, డాన్స్ లకి క్లాప్స్ కొడుతున్నారు. మహేష్ తన కేరెక్టర్ లో చెలరేగిపోయి సినిమాని తనవంతు భుజాలపై మోసాడంటూ పబ్లిక్ మాట్లాడుతుంది. అయితే సినిమాలో ఎక్కడ వెతికినా త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదు, అయన వాడిన డైలాగ్స్ అన్ని సోషల్ మీడియా నుంచి కాపీ కొట్టినవే, థమన్ అయితే తన మ్యూజిక్ ని తనే కాపీ కొట్టుకున్నాడంటూ గుంటురు కారంపై పబ్లిక్ తమ ఒపీనియన్ ని తెలియజేస్తున్నారు.
అయితే గుంటూరు కారం కాంబోపై ఉన్న క్రేజ్ తో ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటుకి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. భారీ పోటీ మధ్యన నెట్ ఫ్లిక్స్ కి గుంటూరు కారం డిజిటల్ రైట్స్ అందాయి. గుంటురు కారం నెట్ ఫ్లిక్స్ నుంచి చూడాలంటే నెలో, నెలన్నరో ఆగాల్సిందే, పెద్ద సినిమాలకి ఎలాంటి టాక్ వచ్చినా.. ఓటిటి రిలీజ్ లేట్ గానే ఉంటుంది. మరి పండగ సెలవలని ఎంజాయ్ చెయ్యాలంటే గుంటూరు కారాన్ని ఓసారి థియేటర్స్ లో చూసేస్తే పోలా..