Advertisement
Google Ads BL

నాడు YSR నేడు జగన్


అటు వైపు ఎంతమంది ఉన్నారన్నది కాదు... వాళ్ళు ఎదుర్కొంటున్నది ఎవరిని అన్నది ముఖ్యం. అటు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంట బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే.. విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువ ఉంటే హీరో అంత బలవంతుడు అని చెబుతున్నట్లే.  ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను స్ఫూరణకు తెస్తున్నాయి కదా.. అవును నిజమే అప్పట్లో 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు 

Advertisement
CJ Advs

TDP+TRS+CPI+CPM కలిసి మహా కూటమి ఏర్పాటు చేశాయి.  మరో వైపు  చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆరోజుల్లో గొప్పగానే కనిపించేది. దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది. చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్ కు కాపులు దూరం అయినా.. వీటన్నిటినీ అడ్డుకుని మళ్ళీ ఆనాడు వైయస్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరేసింది. 

అంతేకాకుండా ఆనాడు రెండోసారి యుపిఎ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో 33 సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రానుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు.  ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే  మొత్తం 294 స్థానాలకుగాను కాంగ్రెస్- 157,  తెలుగుదేశం, తెరాస, వామపక్షాలు కలిసివచ్చిన  మహాకూటమి -106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం - 18,  ఇతరులు 13 సీట్లు గెలిచారు. అంతిమంగా వైఎస్సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు సమర్ధుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి. ఒక్కసారి రాజు కట్టి దూస్తే ఆనక వినిపించేవి ఆర్తనాదాలు.

హిష్టరీ రిపీట్

చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు.. అంటే గతంలో జరిగిన సంఘటనలు.. సన్నివేశాలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఫలితాలు కూడా మళ్ళీ అలాగే వస్తాయి అన్నమాట. ఆ సిద్ధాంతం ప్రకారం 2009లో జరిగినట్లుగానే 

రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ +జనసేన  ప్రస్తుతం పొత్తులో ఉండగా బిజెపిని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. ఇంకా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి పెద్దలను కలిసి తమతో కలిసిరావాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నోరకాలుగా బిజెపిని తమతో కలుపుకునేందుకు ఎన్నోరకాలుగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని ప్రజలే తమకు మద్దతుదారులు అని.. చెబుతూ  తన అంతర్గత సర్వేలు.. నివేదికలు ... లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇటు చంద్రబాబు జనసేన ఎవరికీ ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు.. కాపుల మద్దతు టీడీపీకి ఉంటుందా లేదా అన్నది కూడా ఇంకా కావడం లేదు.. మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం.. అభివృద్ధి తనను గెలిపిస్తాయి అంటూ సింగిల్ గా వెళ్తున్నారు. అప్పట్లో వైయస్ఆర్ సాధించినట్లే సింగి హ్యాండ్ విజయం సాధిస్తాం అని జగన్, ఆయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు.

YS:

YS Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs