Advertisement
Google Ads BL

మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు తగిన ప్రాధాన్యం


వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ ల 2nd లిస్ట్ విడుదల చేసారు. 27 మంది సభ్యులతో కూడిన రెండో జాబితాని మంత్రి బొత్స సత్యన్నారాయణ అధికారికంగా ప్రకటించారు. ఆ 27 నియోజకవర్గాలవారీగా ఎవరెవరు ఏ నియోజకవర్గానికి కేటాయించబడ్డారో.. ఒక్కసారి పరిశీలిస్తే.. 

Advertisement
CJ Advs

కొంతమందికి స్థానచలనం, మరికొన్నిచోట్ల కొత్తవారికి అవకాశం

మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు తగిన ప్రాధాన్యం

గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ సీపీ ఇంఛార్జుల మలి జాబితాను విడుదల చేసింది. సామాజిక సాధికారతే లక్ష్యంగా అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైయస్ జగన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమందిని స్థానాలు మార్చారు. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకీ మార్చారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ను రామచంద్రాపురం నుండి రాజమండ్రి రూరల్ కు మార్పు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ కు మార్చారు. ఆయన స్థానంలో మైనార్టీకి చెందిన షేక్ ఆసిఫ్ కు అవకాశమిచ్చారు,  అలాగే యువకులకు అవకాశం కల్పించే ఉద్ధేశంతో మచిలీ పట్నం నుండి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్టమూర్తికి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి , రామచంద్రాపురం నుండి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు. పోలవరం నుండి తెల్లం బాలరాజు సతీమణి  తెల్లం రాజ్యలక్ష్మికి అవకాశమిచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూ పిఠాపురం నుండి వంగ గీత,జగ్గంపేట నుండి తోట నరసింహం,ప్రత్తిపాడు నుండి వరుపుల సుబ్బారావులకు అవకాశం కల్పించారు. 

మైనార్టీలకు కూడా ప్రాధాన్యత నిస్తూ విజయవాడ వెస్ట్ నుండి షేక్ ఆసిఫ్, గుంటూరు ఈస్ట్ నుండి షేక్ నూరి ఫాతిమా, కదిరి నుండి బియస్.మక్బూల్ అహ్మద్ లకు అవకాశం కల్పించారు. 

సీఎం వైయస్ జగన్ సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్నట్లుగానే ఎస్సీ, ఎస్టీ లకు కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్పీ సామాజిక వర్గం నుండి పాయకరావు పేట నుండి కంబాల జోగులు, పి.గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, ఎర్రగొండపాలెం నుండి తాటిపర్తి చంద్రశేఖర్ లకు అవకాశం కల్పించారు. ఎస్టీ సామాజికవర్గం నుండి   అరకు ఎంపీ స్థానానికి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి లకు అవకాశం కల్పించారు. 

బిసి సామాజిక వర్గం నుండి మార్గాని భరత్, మలసాల భరత్ కుమార్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పిల్లి సూర్యప్రకాష్ లకు అవకాశం కల్పించారు. వైశ్య సామాజిక వర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశమిచ్చారు. 

తొలి జాబితాలో పదకొండు మంది, రెండో జాబితాలో 27 మందిని నియోజకవర్గ ఇన్ చార్జీలుగా నియమించారు. రెండు జాబితాలు కలిపి మొత్తం 38 మందిని నియమించారు. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేశారు. గతంలో వైయస్. జగన్ చెప్పినట్లుగా వివిధ కారణాల వలన స్థానం కోల్పోయిన వారిని పార్టీ సేవలకు, నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామని వైయస్ జగన్ చెప్పారు. సామాజికవర్గాలకు న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ఈ ఇంఛార్జిల ఎంపిక జరిగింది. తాను తరచూ చెప్పే సామాజిక న్యాయాన్ని మరోసారి చేతల్లో చూపారు సీఎం వైయస్. జగన్.

YSRCP :

YSRCP 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs