Advertisement
Google Ads BL

ఏపీలో ప్రజల ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు


ఏ ప్రభుత్వ పాలనలో నాణ్యత, పారదర్శకతకు అక్కడి ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ చాలా కీలకం.. ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు ఏ స్థాయిలో  అందుతున్నాయి అనేందుకు  తెలుసుకోవాలంటే అక్కడి ప్రజలను కనుక్కోవాలి లేదా..  పరిస్థితి తెలుసుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి చూసినా తెలుస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ సేవ, సహాయం కావాలన్నా పెద్ద పెద్ద క్యూ లైన్లలో గంటలకొద్దీ నిలబడి దరఖాస్తు తెచ్చుకోవాలి. దానిని చదువుకున్న వాళ్లతో దాన్ని నింపించి, సరైన ఆధారాలు,.. పత్రాలు జతచేసి సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో ఇవ్వాలి.. ఇచ్చేశాక నాయకులతో చెప్పించుకుని అధికారి చేయి తడిపితే తప్ప మన దరఖాస్తుకు మోక్షం కలగదు.. కులం సర్టిఫికెట్ అయినా, నివాసం, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ అయినా.. చివరకు విద్యార్థులు స్కాలర్ షిప్ పేపర్లు అయినా ఇలాగే ప్రభుత్వానికి చేరాలి.. ఆ దారిలో అందరికీ చేయి తడుపుతూ ఉండాలి.. ఆ తరువాత వాటిని తమకు వస్తున్న మోమూళ్ల స్థాయిని, బరువును బట్టి వాటిని క్లియర్ చేసి ఆయా పథకాలు ప్రజలకు వర్తింపజేస్తున్నారు.  

Advertisement
CJ Advs

కానీ ఏపీలో అలా కాదు. ప్రతి నెల పెన్షన్ 1 వ తారీఖునే వాలంటీర్ ప్రతి ఇంటి గడప తొక్కి వృద్దులకు అందజేయడం. ఇంటికి ఆమడ దూరంలో ఉండే గ్రామా సచివాలయంలో సేవలు అందించేందుకు సిద్ధంగా యువ ఉద్యోగులు, ప్రజలకు సంబంధించిన ప్రతి పనిని చేస్తూ ప్రజల నుంచి శెభాష్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి  సంక్షేమ పథకం అయినా ఎవరి ప్రమేయం లేకుండా.. సిఫార్సులు.. రికమెండేషన్లు లేకుండా నేరుగా అర్హులకు అందించే బాధ్యత సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తీసుకుంటున్నారు. అర్హత ఉండి, నాకు ఈ పథకం అందలేదు అనే వాళ్ళు లేకుండా సంతృప్త స్థాయిలో అందరికీ పథకాలు అందిస్తున్నారు.  విద్యార్థులు స్కాలర్షిప్పులు.. పెన్షన్లు, సర్టిఫికెట్లు.. నివాస, మరణ... జనన ధ్రువీకరణ పత్రాలు.. ఒకటేమిటి ప్రభుత్వం నుంచి అందే వందలాది సేవలు ప్రజలగుమ్మం ముందు వాలుతున్నాయి. 

సంక్షేమ... అభివృద్ధి పాలన... ప్రజలకు కష్టం కలగకుండా చూసుకోవడమే కదా.. పాలకుడి బాధ్యత.. అందుకే వేర్వేరు రాష్టాలకు చెందిన అధికారులు ఆంధ్ర వచ్చి ఇక్కడి పాలనా సంస్కరణలు చూసి ఆశ్చర్యపోతున్నారు.. తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి సేవలు  గురించి ఆలోచించాలని డిసైడ్ అవుతున్నారు.. తన పాలనతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ  ముందుకు సాగుతున్నారు.

Jagan:

AP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs