Advertisement
Google Ads BL

పవన్ సీఎం అభ్యర్థి కాదంటే ఊరుకునేలా లేరు!


రీసెంట్ గా నారా లోకేష్ ఓ ఇంటర్వ్యూలో వచ్చే ఐదేళ్ళలో సీఎం గా చంద్రబాబే ఉంటారని స్పష్టం చేయడంతో..  జనసేన కేడర్ లో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. జనసేన పార్టీలో అంతర్లీనంగా చర్చ మొదలైంది. పార్టీ స్థాపించి పదేళ్ళయింది. కానీ ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. రాజకీయ పొత్తులో భాగంగా తమ అధినేతను చంద్రబాబు వాడుకుని వదిలేస్తే ఎన్నాళ్ళు ఈ మోసం అని పార్టీలో మాట్లాడుకుంటున్నారు. పవన్ ని సీఎం ని చెయ్యకపోతే జనసైనికులు ఊరుకునేలా కనిపించడం లేదు.

Advertisement
CJ Advs

ఒకరికొకరు పొత్తు పెట్టుకున్నపుడు రెండు పార్టీల కార్యకర్తలతో చర్చల తర్వాతనే ఏదైనా నిర్ణయం ప్రకటించాలి. కానీ ఎవ్వరిని సంప్రదించకుండా ఏకపక్షంగా సీఎం కేండిడేట్ చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు సంఘీభావం ప్రకటించి పొత్తు గురించి చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే పొత్తు వివరాలను ప్రకటించి పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా ఉంటే ఇపుడు లోకేష్ పొత్తు నియమాలని పక్కనబెట్టి ఇలా ప్రకటన చేయడమేమిటని జనసైనికులు కుతకుతలాడిపోతున్నారు. ప్యాకేజి స్టార్, జనసేనను టీడీపీ దగ్గర తాకట్టుపెట్టారనే ఆరోపణలు వస్తున్నా పవన్ మీద గౌరవంతో మేము మౌనంగా భరిస్తూ వస్తున్నామని.. ఇకపై ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. 

పవన్ కళ్యాణ్ కి ఉన్న క్యాడర్, ప్రజాభిమానం, యూత్ అభిమానులు వీళ్ళను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోడీ అయినా విలువ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నది. ఈమధ్యన సోషల్ మీడియాలో టీడీపీ ని, టీడీపీ తో పొట్టుని విమెషించేవారు రెబల్స్.. మీకు ఇష్టమైతే జనసేనలో ఉండండి.. లేకపోతే లేదు అని పవన్ స్పష్టము చేసారు. ఆ విషయంలోనూ జనసైనికులు అంతర్గతంగా మధనపడిపోతున్నట్లుగా టాక్ ఉంది.

మనమంతా పవన్ కోసం పోరాడుతుంటే.. ఆయన వెళ్ళి చంద్రబాబు పల్లకీ మోసేందుకు రెడీ అవుతున్నాడు.. ఇదంతా గందరగోళంగా ఉంది.. అని మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వెనుక వెళ్ళి 2014 లో ఓటమి చవిచూశాం. ఇపుడే తమ దారి తాము చూసుకుంటే బెటర్ అన్న ఆలోచనకు వస్తున్నారు జనసైనికులు. తటస్థంగా ఉండిపోవడమే, వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమా అంటూ మీమాంశలో జనసైనికులు ఉన్నట్లుగా చెబుతున్నారు.. చూద్దాం ఏం జరగబోతుందో అనేది.

Pawan Kalyan :

Janasena 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs