కోయిల ముందే కూసింది.. దానిని సర్దుకునే పరిస్దితుల్లో టీడీపీ
నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగిసిన రోజు భారీగా పవన్ కళ్యాణ్ తో చేరి సభ పెట్టాడు. ఆ తర్వాత లోకేష్ టీడీపీ-జనసేన పొత్తుపై అందులోను పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు,చంద్రబాబే సీఎం అభ్యర్థి అంటూ నోరుజారడం సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. లోకేష్ అలా మాట్లాడిన వెంటనే జనసేన గ్రౌండ్ లెవల్ క్యాడర్ లో టీడీపీ తో అల్లయన్స్ మీద వ్యతిరేకత మొదలయ్యింది. అయితే దీనిని డైవర్ట్ చేసే పనిలో భాగంగా చంద్రబాబు పెద్ద స్కెచ్ వేశారు. వెంటనే బీహార్ ప్రశాంత్ కిషోర్ ని రంగంలోకి దింపారు.
వాస్తవానికి చంద్రబాబే సీఎం అభ్యర్థి, కానీ అది ప్రజలకు ఎన్నికలు తర్వాతే చెప్పే ప్లాన్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉన్నారని అనుకున్నారు.. అయితే అందులో కొన్నాళ్ళయినా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలని జనసేన క్యాడర్ కోరుతున్నారు. లోకేష్ ఇలా చంద్రబాబు సీఎం అభ్యర్థి అని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశాం ఇప్పటికీ.. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అంటే జీర్ణించకోలేక పోతున్నారు..
అయితే చంద్రబాబు తెలివిగా దీనిని సర్దుకునే పరిస్దితుల్లో ప్రశాంత్ కిషోర్ ను దింపి టాపిక్ డైవర్ట్ చేశాడంటూ వైసిపి నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు.. బీహార్ PK కి KA Paul డబ్బులు ఇచ్చినా సలహాలు ఇస్తాడు... ఆంధ్రా PK ఏమి పీకలేదు, బీహార్ PK ఏమి పీకుతాడు అంటూ వైసీపీ నేతలు టీడీపీపై పంచ్ లు వేస్తున్నారు.