Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ని ఇరికించేస్తున్న జోగయ్య


చేగొండి హరిరామ జోగయ్య కాస్తా పవన్ చెవిలో జోరీగలా మారారు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు అయిన ఈ మాజీ మంత్రి, మాజీ ఎంపీ పవన్ కళ్యాణ్ పాలిట విలన్ మాదిరి తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ఇమేజిని.. ప్రతిష్టను.. కాపుల్లో ఉన్న విలువ గౌరవాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకుని ర్యాగింగ్ చేస్తున్నారు.  పెద్దాయన రామ కృష్ణా అని మూల కూర్చోకుండా పవన్ను పరుగెత్తిస్తున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ను గత కొద్దిరోజులుగా ఎదురుప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

Advertisement
CJ Advs

కాపులకు ప్రాధాన్యం దక్కాలని కోరుకునే ఈ సీనియర్ మొన్నామధ్య జనసేనకు కనీసం 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఒక లేఖ రాసారు.. ఆశలు పవన్ కు ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా ఓ పాతిక ఇరవై సీట్లు చంద్రబాబు ఇస్తాడేమో అని జనసైనికులు భావిస్తున్న తరుణంలో మాకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ మొన్న జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమయింది . కాపులు దాదాపు 50 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారని, వారికి ప్రాధాన్యం ఇవ్వనప్పుడు చంద్రబాబు 

 వెంట ఎందుకు వెళ్లాలని, ఆయనకు ఎందుకు ఊడిగం చేయాలనీ ప్రశ్నిస్తూ జోగయ్య లేఖ రాసారు. అది అలా ఉండగానే ఇప్పుడు నేను మరో బాణం సంధించారు. 

నిన్ను ఎక్కడికో తీసుకుపోదామని మేము అనుకుంటున్నాం.. కానీ మీరు అక్కడికి రారు.. ఇక్కడే ఉంటాను అంటారు. ఇలా ఐతే ఎలా అని ప్రశ్నించారు.. అసలు ఆ కూటమికి చంద్రబాబే నాయకుడు, ఆయనే ముఖ్యమంత్రి అంటూ మొన్న లోకేష్ సైతం ప్రకటించారు. అలా అయన ప్రకటించాక కూడా మీరు  చంద్రబాబు వెంట వెళ్తారా ? అంటూ జోగయ్య ప్రశ్నించారు. అంటే మీరు చంద్రబాబుకు తాబేదారుగా ఉంటారా ? మీరు బానిసత్వాన్నే కోరుకుంటున్నారా ? మీకు అస్తిత్వం లేదా .. కాపుల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత లేదా అంటూ జోగయ్య వేసిన ప్రశ్నలు పవన్ను గుక్కతిప్పుకోనివ్వడం లేదు.

Pawan Kaiyan :

Pawan Kaiyan 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs