Advertisement

కిడ్నీ బాధితుల కోసం వైయస్ఆర్ సుజలధార


దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న కిడ్నీల సమస్య. ప్రాణాలు పోతున్నాయి మహాప్రభో అన్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే తప్ప గత ప్రభుత్వాలు చేసింది లేదు. తుతు మంత్రంగా ముసలికన్నీరు కార్చడం, కంటి తుడుపు చర్యలు తప్ప ఉద్దానం పీడిత ప్రజలకు చేసేందేమి లేదు. జగనన్న పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారు. ఆస్పత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను విన్నారు...చుశారు. చలించిపోయారు. ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే మీ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హమీ ఇచ్చారు. ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హమీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చుచేసి ఆస్పత్రి నిర్మించింది.  డాక్టర్‌ వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌ గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్ని వ్యాధికి గల మూల కారణాల పై పరిశోధన చేసి నివేదిక సిద్దం చేసింది. రోగం వచ్చాక ట్రీట్ మెంట్ చేయడం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళఇక సిద్దం చేశారు. కార్పోరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్ని రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హమీ మేరకు ఆస్పత్రి నిర్మాణం చేయడమే కాకుండా, రోగానికి మూలమైన నీటిని అందించేందుకు సుమారు 700 కోట్ల రూపాయలతో నీరు అందించేందుకు శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగనన్న

Advertisement

ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరు అందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలధార ప్రాజెక్టును జగనన్న ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు వంద లీటర్లు చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నెల 14న సీఎం వైయస్ జగన్ గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభంకానుంది.ఈ రెండు ప్రాజెక్టులను సీఎం జగనన్న చేతుల మీదుగా ఈ నెల 14 వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఉద్దానం కిడ్ని రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగననన్న శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. ఈన్నెళ్ళుకు తమ సమస్య పరిష్కారం కాబోతుందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు.

గత ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. కంటితుడుపు చర్యలుగా మాత్రమే చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించలేదు. ఇక ఇది మా ఖర్మ అనుకుంటున్నా తరుణంలో సీఎం వైయస్ జగనన్న పాదయాత్రలో ఆ ప్రాంతాన్ని సందర్శించి వారి బాధలని అర్థం చేసుకుని అధికారంలోకి వచ్చాక ఆ మహమ్మారిని రూపుమాపుతానని ఏదైతే హమీ ఇచ్చారో అది నేరవేరడంతో ఉద్దానవాసుల జీవితాలు వెలుగులు నిండబోతున్నాయి.

:

YS Jagan For Uddhanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement