Advertisement
Google Ads BL

హైకోర్టు తీరుపై.. సుప్రీంలో సవాల్


స్కిల్ స్కాములో అరెస్ట్ అయి రెండు నెలలు జైల్లో ఉంటూ మొన్న ఈమధ్యనే అనారోగ్య కారణాలతో  బెయిల్ మీద వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సాధారణ బెయిల్ వచ్చిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు, పత్రికలూ చేసిన ఓవర్ యాక్షన్ ప్రజలను అయోమయానికి గురిచేసింది. ఎల్లోమీడియా పత్రికలూ, ఛానెళ్లలో సైతం ఓవైపు అమాయకుడైన  బాబును అరెస్ట్ చేశారు అంటూ మరోవైపు ఘనంగా బెయిల్ వచ్చింది న్యాయం గెలిచింది.. అంటూ ప్రత్యేక కథనాలు వండి వార్చారు. జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన వ్యక్తిని కీర్తిస్తూ కథనాలు వండి వార్చారు. వరల్డ్ కప్ గెలిచి వస్తున్న మహా క్రీడాకారుడా ? దీనికోసమే మీడియా అంత చెయ్యాలా.. ఏమి చేస్తున్నారో తెలియనంత సోయలేకుండా ఉన్నారా ప్రజలు ? ఇన్నాళ్లుగా దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న పార్టీకి ఒక దిక్కు లభించిందన్న ఆనందం తప్ప ఆయన విడుదలతో ఏమి ఒరిగింది. ఆయన అవినీతి చేయలేదని కోర్టు చెప్పలేదు.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే సీఐడీ కూడా దాదాపు 140 వరకూ ఆధారాలు సేకరించినట్లు కోర్టులు పేర్కొంది. 

Advertisement
CJ Advs

బాబు బెయిల్ మీద సుప్రీం కోర్టులో అప్పీల్ 

ఇదిలా ఉండగా చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బెయిల్ రాగా దాన్ని సీఐడీ సుప్రీం కోర్టులో సవాల్ చేయనుంది. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ పలు అంశాల్లో హైకోర్టు తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.  రాష్ట్ర ప్రభుత్వంపిటిషనర్లు వాదించని, వారు కోరని అంశాల్లోకి కూడా హైకోర్టు వెళ్లేందుకు ప్రయత్నించింది. హైకోర్టు తన అధికారపరిధిని అతిక్రమిస్తూ తీర్పులో వ్యాఖ్యానాలు చేసింది. కేసు మెరిట్స్‌ గురించి, ఔచిత్యం గురించి,  దర్యాప్తులో లోపాలుగురించి బెయిల్‌ పిటిషన్‌ సమయంలోనే కెమెంట్లు చేసింది.. సీఐడీ దర్యాప్తుపై ఇప్పటికే టీడీపీ పార్టీ నాయకులు, ప్రతినిధులు నిరంతరం ఇష్టానుసారం కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో బెయిల్‌ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యానాలను వారు సానుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది.

దర్యాప్తునకు సహకరించకుండా సీఐడీ ఆధారాలు చూపెట్టలేదంటారా ?

స్కిల్‌ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కానీ ఇది ఇది తొందరపాటుగా భావిస్తున్నాం. అని సీఐడీ పేర్కొంది. ఇంతేకాకుండా టీడీపీ నుంచి ఎవరూ ఇప్పటివరకూ దర్యాప్తునకు హాజరు కాలేదు, సీఐడీ అడిగిన సమాచారం కూడా ఇప్పటివరకూ ఇవ్వలేదు. దర్యాప్తునకు సహకరించడంలేదని కోర్టుకు స్పష్టంగా తెలియజేశాం అలాంటపుడు ఆ డబ్బు టీడీపీ ఖాతాకు చేరలేదని ముందే హైకోర్టు ఎలా తేల్చేస్తుంది. అంటూ సీఐడీ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.ఈ స్కాంలో కుట్రకోణం అత్యంత కీలకమైనది, నేరం జరగడానికి దారితీసిన పర్యవసానాల్లో ఏ స్థాయిలో ఎవరు పాలుపంచుకున్నా చట్టాన్ని దాన్ని తీవ్రంగానే చూస్తుంది అని ప్రభుత్వం చెబుతోంది. అలాంటపుడు కోర్టు దర్యాప్తు పూర్తి కాకుండానే చంద్రబాబుకు సంబంధం లేనట్లు వ్యాఖ్యానించడం నిబంధనలకు విరుద్ధం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐడీ అభిప్రాయపడుతూ కేసును సుప్రీం కోర్టులో సవాల్ చేస్తున్నారు

AP CID:

CBN Bail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs