ఎమ్మెల్యేగా ప్రజలు పక్కపెట్టారు. దానితో పదవి పోయింది.. దానికితోడు పాతకేసులు వెంటాడుతుండగా అరెస్ట్ అయి స్టేషన్లో కూడా ఉండొచ్చారు. అయినా దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు పులుపు.. బలుపు తగ్గలేదు.. తన కన్నా కింది స్థాయివాళ్ళు కనిపిస్తే దాడులు చేయడం.. అనేది ఇప్పటికి ఇంకా మానలేదు. మీ ఎస్సీ లకు ఎన్నికలు.. రాజకీయాలు ఎందుకురా... మేము రాజకీయాలు చేస్తాం .. మీరు జస్ట్ ఓట్లు వేయండి చాలు అని బహిరంగ సభలో అహంకార పూరితంగా మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ ఇంకా అదే బలుపుతో ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో రోడ్లు వేస్తున్నందుకు అడ్డుకున్నారని అటవీ సిబ్బందిని కొట్టడంతోబాటు ఇసుక దందాను ఆపినందుకు ఎమ్మార్వోతో గొడవపెట్టుకున్న చింతమనేని ఇంకా అదే పొగరు.. చూపుతూ అందర్నీ భయపెడుతున్నారు.
తాజాగా పెదవేగి మండలం, రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు.
తన జీడి మొక్కల దగ్గరకి గొర్రెలు వెళ్లాయంటూ, అటుగా వెళుతున్న చింతమనేని కారు దిగి, లక్ష్మీనారాయణ ను తిడుతూ ఆయన్ను కింద పడేసి కొట్టడమే కాకుండా అతని గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎక్కించుకొని తీసుకుపోయాడని లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశాడు. ఎవడొస్తాడో చూస్తానని, ఎవడికి చెప్పుకుంటావో, చెప్పుకోమంటూ చింతమనేని బెదిరించాడని, ఈ సంఘటనకు అక్కడే ఉన్నవారంతా సాక్ష్యమని తన బాధ చెప్పుకున్నాడు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే, దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీయగా, తాను కొట్టలేదని చెబుతూ,వాదిస్తూ వెళ్ళిపోయాడు. మొత్తానికి చింతమనేనికి ఇంకా బలుపు తగ్గలేదని, ఈ ఎన్నికల్లో కూడా ఓడిస్తే తప్ప పొగరు కిందికి దిగదని ప్రజలు అంటున్నారు.