Advertisement
Google Ads BL

జగనన్న ఆరోగ్య సురక్ష.. అందరికీ రక్ష


ఇన్నాళ్లూ ఒకెత్తు.,.. ఇప్పుడు ఇంకో ఎత్తు.. రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నది సీఎం వైయస్ జగన్ సంకల్పం. మరి అలా ఉండాలంటే ఎలా ? ప్రజలందరికీ వైద్య సేవలు అందితేనే కదా అలా ఉండేది. పేదలు .. వృద్ధులు.. వికలాంగులు .. ఇల్లు కదల్లేనివాళ్ళు.. మరి వీళ్ళందరికీ ఎలా... ఎవరు వైద్యం చేస్తారు. ఎవరు చికిత్స చేస్తారు. దైన్యంలో ఉన్నవారికి వైద్యం ఎవరు చేస్తారు.. వాళ్ళను ఎవరు పట్టించుకుంటారు. ఎవరూ తోడులేనివారికి దేవుడే దిక్కు అంటారు. ఇప్పడు అలాంటి వారిపట్ల సీఎం వైయస్ జగన్ దేవుడయ్యారు. 

Advertisement
CJ Advs

తన ప్రతినిధులుగా ఇంటింటికీ వైద్య సిబ్బందిని పంపిస్తున్నారు. ఎవరెవరికి ఏయే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో పరీక్షలు చేసి, అక్కడికక్కడే మందులు ఇచ్చి, అవసరం ఐతే పెద్ద ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇంటింటికి డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది రాకతో ప్రజలకు తమ గుమ్మం ముందే వైద్యం అందుతోంది. సెప్టెంబర్ 30న మొదలైన ఈ బృహత్తర కార్యక్రమం ఇన్ని రోజులుగా కోట్లాదిమందికి సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటా ఆరోగ్యాన్ని పంచుతోంది

వేలల్లో వైద్య శిబిరాలు.. లక్షల్లో చికిత్సలు

ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12000 వైద్య శిబిరాలు నిర్వహించగా 60.9 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అందులో 59. 2 లక్షలమందిని వైద్య సిబ్బంది, డాక్టర్లు పరీక్షించారు. ఇప్పటివరకూ 1. 44 కోట్ల గృహాలను వైద్య సిబ్బంది సందర్శించి 6.4 కోట్ల పరీక్షలు చేశారు. 3. 78 కోట్లమందికి ఆరోగ్య స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో 13,930 వరకూ శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఇక 1. 38 కోట్ల కుటుంబాలను వార్డు, గ్రామ వాలంటీర్లు సందర్శించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఈ  విధంగా ఇంటింటికీ వైద్యం అందిస్తున్న సీఎం వైయస్ జగన్ అందరి ఇళ్లలో ఆరోగ్యం రూపంలో నిలిచారు.

Jagananna Arogya Suraksha.. Protection for all people:

Jagananna Aarogya Suraksha-Specialist Doctor Enrollment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs