Advertisement

జీఎస్టీ వసూళ్ళలో ఏపీ టాప్


సరైన రౌతు దొరకాలి కానీ కుంటిగుర్రం సైతం రేసుగుర్రమైపోతుంది. సరైన గురువు దొరకాలి కానీ సాధారణ విద్యార్ధి సైతం ఆలిండియా రాంకులు కొడతాడు. అలాగే ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాకానీ కుటుంబ పెద్ద బాధ్యత అయినవాడు ఐతే ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. పాలకుడిలో బాధ్యత ఉంటే ఎంతటి ఆర్థిక లోతులో ఉన్న రాష్ట్రం అయినా ప్రగతిపథంలోకి వెళుతుంది. తన పన్నుల ఆదాయం పెంపొందించుకుని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోహదపడుతుంది. 

Advertisement

రాష్ట్రంలో అమలవుతున్న వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక విధానాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సులభతరం వాణిజ్య విధానాలు అమలు చేయడంలోనూ, దేశీయ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ఆంధ్రప్రదేశ్ గొప్ప ప్రగతి సాధించినట్లు కేంద్రం విడుదల చేసిన నివేదికల్లో ఇప్పటికే వెల్లడైంది. 

అక్టోబర్ 2023 వరకు GST వసూళ్ల వృద్ధి రేటులో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ GST ఆదాయం 12% వృద్ధి రేటుతో రూ. 18,488 కోట్లుగా ఉంది.

ఇక దక్షిణాది రాష్ట్రాలు అయిన కర్ణాటక కూడా 12% వృద్ధి రేటుతో ఆంధ్రతో సమానంగా ఉండగా మిగతా తెలంగాణ 10%, తమిళనాడు 9%, కేరళ 5% వృద్ధి రేటును నమోదు చేశాయి. 

భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్‌లో స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.1,72,003 కోట్లుగా ఉంది. మొత్తంలో రూ.30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, రూ.38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, రూ.91,315 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 42,127 కోట్లతో కలిపి) ఐజీఎస్టీ, రూ.12,456 కోట్లు (రూ. 1,294 కోట్లతో సహా) వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయి.  

మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పన్నుల ఆదాయంలో దూసుకుపోతోంది దీనికి సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులు అంటున్నారు.

AP tops in GST collections:

AP: It is ahead of other states with a growth rate of 12%
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement