Advertisement
Google Ads BL

లండన్ లో YSRCP సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం


వైయస్ఆర్ సీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ నాయకుడు ఓబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లండలో వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా సమావేశం దిగ్విజయంగా సాగింది. 

Advertisement
CJ Advs

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైయస్ఆర్ సీపీ రాష్ట్ర మీడియా మరియు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి గారు, APNRTS అధ్యక్షులు మేడపాటి వెంకట్ గారు, APSSDC రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ పండుగాయల రత్నాకర్ గారు పాల్గొన్నారు. UK నలు మూలల నుంచి 450 మందికి పైగా వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యి కార్యక్రమం విజయ వంతం చేశారు. 

సజ్జల భార్గవ రెడ్డి గారు మాట్లాడుతూ: రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి క్షణం జగనన్న కష్టపడుతున్నారు. ప్రజా సంక్షేమమే కాదు అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా జగనన్న నిలిచారు. దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడే జగనన్నకు మనం అందరం అండగా నిలవాలి. ఏపీలో గ్రామాలను సీఎం జగనన్న ఎంత అభివృద్ధి చేశారో మీరందరూ భారత దేశం వచ్చినప్పుడు చూస్తే ఆశ్చర్య పోతారని అన్నారు. 

రానున్న రోజుల్లో సోషల్ మీడియాలో ఎలా పని చేయాలో,  175/175 టార్గెట్ గా అందరం కలిసి చేద్దామని, మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటానని సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

YSRCP Social Media Summit in London:

Ysrcp Social Media Meeting In London
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs