Advertisement
Google Ads BL

లోకేష్‌కు నో బెయిల్.. బిగుస్తున్న ఉచ్చు..!


ఏపీ రాజకీయాలు గత 20 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూనే తిరుగుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబును అరెస్ట్ చేయడం.. ఆయనకు బెయిల్ రాకుండా నానా ఇబ్బందులు పెట్టడం.. మరోవైపు ఔటర్ ఇన్నర్ రింగురోడ్డు కేసు, 49వేల కిలోమీటర్ల విద్యుత్ లైన్ ఏర్పాటులో కుంభకోణం ఇలా చాలానే సిద్ధం చేసింది జగన్ సర్కార్. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీని నిర్వీర్యం చేయాలని భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ రెడ్డి.. బాబు తర్వాత పార్టీకి అన్నీతానై చూస్తున్న నారా లోకేష్‌ను కూడా జైలుపాలు చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ను ఇప్పటికే ఏ-14 నిందితుడిగా చేర్చిన సీఐడీ.. ఇప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయడానికి ఏకంగా ఢిల్లీకే వెళ్లింది. ఈ పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం చినబాబు దరఖాస్తు  చేసుకున్నారు. అయితే కోర్టు మాత్రం బెయిల్‌ను తిరస్కరించి.. విచారణకు సహకరించాలని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు కోర్టు.. లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో లోకేష్ అరెస్టుకు సీఐడీకి లైన్ క్లియర్ అయినట్లయ్యింది. ఈ తాజా పరిణామాలతో లోకేష్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లయ్యింది.

Advertisement
CJ Advs

 

కాస్త శుభవార్తే కానీ..!

సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే స్కిల్ కేసులో లోకేష్‌కు కోర్టుల్లో ఊరట లభించింది. లోకేష్ పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు.. వచ్చే నెల 4వరకు అరెస్ట్ చేయొద్దని సీఐడీని ఆదేశించింది. ఇది టీడీపీ శ్రేణులకు ఒకింత శుభవార్తే కానీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాత్రం లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఆందోళన మాత్రం తగ్గట్లేదు. వీరిద్దరు మాత్రమే కాదు.. పార్టీలోని కీలక నేతలు మరికొందరిని జైలుకు పంపేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసిందని సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రాథమిక ఆధారాల మాటేమో కానీ సాగదీస్తూ కాలయాపన చేస్తోంది వైసీపీ. దాదాపు ఎన్నికల వరకూ వీరిని బయటకు రానిచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. అటు స్కిల్ కేసు.. ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మాత్రమే కాదు.. లోకేష్‌పై ఫైబర్ నెట్ కేసును బనాయించింది సీఐడీ. మొత్తానికి చూస్తే లోకేష్‌కు గట్టిగానే ఉచ్చు బిగుస్తోందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

 

వేర్ ఈజ్ లోకేష్!

మరోవైపు.. లోకేష్ ఎక్కడున్నారనే విషయం తెలియట్లేదని సీఐడీ చెబుతోంది. చినబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ బృందం ఢిల్లీకి వెళ్లింది. లోకేష్‌ను విచారించేందుకు 41ఏ కింద నోటీసులివ్వడానికి సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఢిల్లీ నుంచి విదేశాలకు పారిపోయే అవకాశాలున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. గత కొన్నిరోజులుగా ఢిల్లీ వేదికగా లోకేష్ మకాం వేయడానికి కారణమిదేననే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఐడీ నోటీసులు అందుకునే పరిస్థితి ఉందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే వదలా బొమ్మాలి అని సీఐడీ ఉంటే.. నేను దొరకను అని లోకేష్ అయితే ఉన్నారు.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో మరి.

No bail for Lokesh.. The trap is tightening..!:

Ground Getting Cleared For Lokesh Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs