Advertisement

IMF వద్ద AP స్టూడెంట్స్ ప్రతినిధి బృందం


మానవ వనరులపై పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ విధానాలను IMF ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల కూడా ఈ విధానాలను  అనుకరించాలని ఐఎంఎఫ్ అధికారులు సూచించారు.

Advertisement

అమెరికాలో పర్యటిస్తున్న విద్యార్ధి బృందం తాజా వాషింగ్టన్ డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కార్యలయాన్ని సందర్శించారు. అక్కడి అధికారుల ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌తో సహా భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్ (మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు)తో విద్యార్థలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ అధికారులు ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు 

విద్యార్థులు ఆత్మస్థైర్యం మరియు ధృడసంకల్పంతో చదువుకుని మన దేశానికి తిరిగి అత్యధికమైన ఉత్సాహంతో పని చేసి దేశ కీర్తి చాటి చెప్పాలి- భారతదేశ ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. సుబ్రమణియన్

 మీ కలలను అనుసరిస్తూ మీరు ఎన్నుకన్న మార్గంలోనే మందుకు సాగి ఎత్తైన శిఖరాలు చేరుకోవాలి- ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్‌

విద్యార్ధులు జీవితంలో ఎలా విజయం సాధించాలనే దానిపై మార్గదర్శకత్వం, చిట్కాలను స్వీకరించటం గొప్ప విషయమని కె. సుబ్రమణియన్ అన్నారు. అయితే విద్యార్ధులకు సుబ్రమణియన్ తన వ్యక్తిగత విజయగాథనే ఉదాహరణగా చెబుతూ, తన చదువే తనని ఐఎంఎఫ్ లో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టిందని, యువతకు నిజమైన ప్రేరణగా పనిచేసిందని చెప్పారు. అదేవిధంగా, నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చిన గీతా గోపీనాథ్‌, ఐఎంఎఫ్ లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎదిగేవరకు చేసిన తన కృషిని, తన విశేషమైన ప్రయాణాన్ని విద్యార్ధులతో పంచుకున్నారు. దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అందుకోగలరనే నమ్మకాన్ని విద్యార్థుల్లో నింపేలా ఆమె మాటలు విద్యార్థులను ఎంతగానో ఉత్సాహాన్ని ఇచ్చాయి.

కె. సుబ్రమణియన్, గీతా గోపీనాథ్ వంటి నిష్ణాతులైన వ్యక్తులతో విద్యార్ధుల సమావేశం నిస్సందేహంగా వారికొక ప్రేరణగా నిలుస్తాయని చెప్పటంలో అతీశయోక్తి లేదు.

విద్యార్ధులకు అద్భుతమైన ప్రపంచ వేదికను అందించే లక్ష్యంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటన, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల పనితీరుపై అంతర్దృష్టిని పొందేందుకు మరియు విశేషమైన విజయాన్ని సాధించిన నిష్ణాతులైన వ్యక్తుల నుండి నేర్చుకోవడానికి విద్యార్దులకు ఒక అద్భుతమైన అవకాశంగా పరిగణించవచ్చు. 

మన విద్యార్ధుల్లో స్థైర్యాన్ని నింపిన కె సుబ్రమణియన్ మరియు గీతా గోపీనాథ్ వంటి అధికారుల కృషికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. వారి మార్గదర్శకత్వం మరియు ప్రేరణ విద్యార్థుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది, శ్రేష్ఠత కోసం కృషి చేయడానికి మరియు సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి వారిని శక్తివంతం చేస్తుంది.

A delegation of Andhra Pradesh students at the IMF headquarters:

A delegation of Andhra Pradesh students at the International Monetary Fund (IMF) headquarters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement