Advertisement

లోకేశ్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా..?


స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టిన సంగతి తెలిసిందే. మచ్చలేని బాబును ఒక్కసారైనా అరెస్ట్ చేయాలని భావించిన సీఎం వైఎస్ జగన్.. తన వ్యవస్థలను వాడుకొని అరెస్ట్ చేయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదలా ఉంచితే.. టీడీపీకి ఊపిరాడనివ్వకుండా చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న జగన్ రెడ్డి.. ఆ పార్టీలో నంబర్‌గా నాన్న అరెస్ట్ తర్వాత అన్నీ తానై చూసుకుంటున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కూడా అరెస్ట్ చేయబోతున్నారని గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వైసీపీ శ్రేణులు ఈ సమాచారాన్ని తెగ వైరల్ చేస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత.. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ప్రభుత్వం తీరును జాతీయ స్థాయిలో ఎండగట్టాలని భావించిన అధిష్టానం లోకేష్‌ను ఢిల్లీకి పంపింది. నాలుగైదు రోజులుగా చినబాబు వరుస ఇంటర్వ్యూలు, పార్లమెంట్‌లో ఎంపీలు ఏం మాట్లాడాలనే కార్యాచరణపై దిశా నిర్ధేశం చేస్తూ బిజిబిజీగానే గడుపుతున్నారు. సోమవారం అర్ధరాత్రికి లోకేష్ రాజమండ్రి చేరుకోబోతున్నారు. ఆయన వచ్చీ రాగానే సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

ఇంతకీ ఆ ప్రచారంలో ఏముంది..?

ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేష్‌ను అరెస్ట్ చేయనున్నారని వైసీపీ శ్రేణులు ఓవరాక్షన్ చేస్తున్నాయి. లోకేష్ అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలను సైతం ఉన్నతాధికారులు సిద్ధం చేశారని కూడా ప్రచారం ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పుడే తొందరపడి లోకేశ్‌ను అరెస్ట్ చేయరంటూ ప్రచారం కూడా నడుస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్ట్‌తోనే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏవిధంగా ఉంటాయని మదింపు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ వర్గాలు సమాయత్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. సంచలనం సృష్టించిన ఈ ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం విదితమే. అరెస్టయిన వారికి న్యాయస్థానాల్లో చాలా మందికి బెయిల్ కూడా వచ్చింది. రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసు పెండింగ్‌లో ఉంది. చూశారుగా వైచీప్ పాలిట్రిక్..!

ఎందుకింత పైత్యం..?

అసలే చంద్రబాబును అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం కావాల్సిన అప్రతిష్ట మూటకట్టుకుంది. చంద్రబాబును అరెస్ట్ మరుక్షణం నుంచి ఇప్పటి వరకూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున బాబుకు మద్దతు వస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు, ర్యాలీలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పటీ పార్టీ కార్యక్రమాలు సవ్యంగా సాగుతుండటంతో పాటు.. తెలుగు తమ్ముళ్లంతా ఈ కష్టకాలంలో ఐక్యంగా ముందుకెళ్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతేనని ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలతో ఒక్కసారిగా జగన్ సర్కార్ గ్రాఫ్ పడిపోయింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో మరింత గ్రాఫ్ పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యుత్సాహంతో లోకేష్‌ను అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎలాగుంటాయో ఊహకందట్లేదు. తండ్రిని అరెస్ట్ చేశారని లోకేష్ కష్టకాలంలో ఉంటే.. ఇలా అరెస్ట్ చేస్తున్నారని వార్తలను వైరల్ చేస్తూ పైత్యం ప్రదర్శిస్తూ వైసీపీ శ్రేణులు శునాకానందం పొందుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి.. మంగళవారం ఉదయం కల్లా ఏదైనా జరగొచ్చని మాత్రం వార్తలు గుప్పుముంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Is the stage ready for Lokesh arrest?:

Is the stage ready for Lokesh arrest?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement