Advertisement
Google Ads BL

స్కిల్ కుంభకోణం డైవర్ట్ చేయడమే లక్ష్యం


తెలుగుదేశానికి, చంద్రబాబుకు అర్థమైంది. ఆర్థికనేరాల కేసుల్లో బెయిల్ అంత త్వరగా రాదని, ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉండక తప్పదని టిడిపికి, చంద్రబాబుకు అర్థమైంది. మరి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో పార్టీని నడిపేది ఎవరు.. లోకేష్   పనికిరాడు ... అయన ముడుపులు.. కమిషన్లు మాత్రమే తీసుకోగలడు తప్ప పార్టీని, క్యాడర్ను నడపలేడు. బాలయ్య జనంలోకి వెళ్తే క్యాడర్ భయపడి పారిపోతారు... మరి చంద్రబాబు వచ్చేవరకూ పార్టీని జనంలో యాక్టివ్ గా  ఉంచేది ఎలా అని జైల్లో తీరిగ్గా ఆలోచించిన చంద్రబాబు ఇక లాభం లేదనుకుని తమ పాత చుట్టం .. పిలవగానే వచ్చి... ఏది చెబితే అది చేసే పవన్ను పిలిపించారు. గురువారం ములాఖత్ లో భాగంగా చంద్రబాబును లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిశారు. ఆ తరువాత పవన్ ఒక్కరే మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో తామంతా కలిసి నడుస్తామని, జగన్ అరాచకాలను అడ్డుకుంటాం అని అన్నారు

Advertisement
CJ Advs

సముద్రం ఒకరు ముందు తలవంచదు.. తుఫాను ఎన్నడూ యాచించదు అని గతంలో భారమైన డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు మోకరిల్లేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా స్పందన లేదు. భారీగా సానుభూతి వస్తుందనుకుంటే అదీ లేదు.   ఇన్నాళ్లకు అవినీతి పరుడికి తగిన శాస్తి జరిగిందని అనుకున్న వాళ్లే తప్ప అయ్యో అనేవాళ్ళు లేరు.  విషయంమీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం తమ నాయకుల వద్ద ఆవేదన వెలిబుచ్చారు. జనాన్ని పోగుచేయాలని విజయవాడ నాయకులను అయన ఆదేశించిన విషయం కూడా ఆడియో టేప్ లీకైంది. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి తక్షణమే అద్దె జనం అండదండలు కావాలని, లేకుంటే మనుగడ కష్టమే అని అర్థం ఐంది. అందుకే డబ్బు ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్న చంద్రబాబు జనంలో షో.. డ్రామా నడిపేందుకు జనం.. ఆలోచన లేని కేవలం ఆవేశమే ఉన్న యువత కోసం సరైన స్కెచ్ గీశారు.. డబ్బుతో ఇక ప్రజా ఉద్యమాన్ని నడుపుతారన్నమాట.  వాస్తవానికి పదేళ్లుగా పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కలుస్తున్నది కాదని ప్రజలు భావిస్తున్నారు. 

కాపు యువత బలి కానుందా ? 

ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ ఎలాగూ టిడిపితో పొత్తు కలిపేశారు కాబట్టి చంద్రబాబు కోసం కాపులు రోడ్డెక్కాల్సిన అనివార్యతను పవన్ కల్పించారు. అంటే ఇప్పుడు  జనసైనికులు,కాపు యువత తెలుగుదేశం కోసం ధర్నాలు చేయాలి.. ఆందోళనలు చేయాలి.. ప్రభుత్వంతో పోరాడాలి.. రెండు భుజాలమీద రెండు పార్టీల జెండాలు పట్టుకుని జనసైనికులు యుద్ధం చేయాలి. కేసులకు ఎదురెళ్లాలి.. ఆందోళనలు చేయాలి.. అవసరం ఐతే పోలీస్ దెబ్బలు తినాలి

ఇంతా చేస్తే అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు ? మొదటి నుంచి మన కాపులు.. మన అస్తిత్వం అని ఆశతో ఉంటూ వస్తున్నా కాపు నాయకులూ, యువతకు సీట్లు దక్కుతాయా ? అదంతా ఎవరికీ అర్థం కానీ బ్రహ్మ పదార్థం. అసలు పొత్తులో భాగంగా మీకెన్ని సీట్లు అని విలేకరి అడిగిన ప్రశ్నకు అదంతా తరువాత చూద్దాం.. ముందైతే కలిసి పని చేద్దాం అన్నారు పవన్. అంటే ఇప్పుడు జనసైనికులు సైతం టిడిపికి కూలీలుగా పని చేయాలి.. జీతం సంగతి అంటారా ? పవన్ కళ్యాణ్‌కే సీట్ల గురించి క్లారిటీ లేనపుడు జన సైనికులకు మాత్రం ఏమి అంచనా ఉంటుంది. అందాకా ఏమీ అడక్కుండా పని చేయడమే వారి తక్షణ కర్తవ్యంగా మార్చేశారు పవన్ కళ్యాణ్.

The aim is to divert the skill scam:

Pawan, Balayya and Lokesh met Chandrababu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs