Advertisement
Google Ads BL

లోకేష్ పై పోలీసులకు YCP సోషల్ మీడియా ఫిర్యాదు


యువగళం పాదయాత్రలో కొద్దిరోజులుగా నారా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు, హెచ్చరికలు ఆయన్ను చిక్కుల్లో పడేసేలా ఉన్నాయి. ఎక్కువ కేసులు ఉన్నవారికి పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాం కాబట్టి మీరు పోరాడండి.. కొట్లాడండి అంటూ తెలుగుదేశం కార్యకర్తలకు లోకేష్ ఆయా ప్రసంగాల్లో పిలుపునిచ్చారు. దీనిపట్ల YCP పార్టీ సోషల్ మీడియా భగ్గుమంది. ఒక రాజకీయనాయకుడై ఉండి కార్యకర్తలను హింసవైపు నడిపిస్తారా ? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు ? ఇదేనా నాయకుడి తీరు. ఆయన తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి ప్రభుత్వం మీద, అధికారుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలమీద దాడులకు దిగితే ఎవరు బాద్యులు ఆయన్ని ఎవరు ఆపుతారు ? ఇలా హింసను ప్రేరేపించే లోకేష్ మీద , పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ప్రతి జిల్లాల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ఆనాడు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని దీనికి టిడిపి నాయకత్వమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సమాజంలో శాంతియుత జీవనానికి విఘాతం కలిగించేలా లోకేష్ ప్రకటనలు ఉంటున్నాయని,  ఈ నేపథ్యంలో అయన మీద కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు వెళుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు.

YCP social media complaint to police against Lokesh:

YCP social media complaint to police against Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs