Advertisement
Google Ads BL

విజన్ 2047 వస్తే విధ్వంసమే.


చంద్రబాబులో ఉండే ఓ లక్షణం ఏమంటే ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని, తాను ఏది చెబితే అది గొప్ప అని, తాను ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చెయ్యగలను అనేది ఆయన విశ్వాసం. ఇరవయ్యేళ్ళ క్రితం తాను విజన్ - 2020 అంటూ అదేదో అద్భుతమైన కాన్సెప్ట్ అని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఆయన తనకు విజన్ ఉందని అంటారు.. చేసేవన్నీ వ్యవస్థలను ముంచేసే పనులు.. గుడ్డి నిర్ణయాలు. కానీ ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అంటూ మళ్లీ ప్రజలముందుకు వస్తున్నారు. అప్పట్లో విజన్ 2020 అంటూ వచ్చిన చంద్రబాబు చేసిందేమిటి ? ప్రజలకు, సమాజానికి ఒరిగిందేమిటి ఒక్కసారి చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూద్దాం.. 

Advertisement
CJ Advs

పరిశ్రమమల అమ్మకాలు:

తనను తానొక సీఈవోగా ఊహించుకునే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దాదాపు 54 పరిశ్రమలను అమ్మేశారు. అయ్యో ఆ సంస్థలు నష్టాల్లో ఉన్నాయి .. వాటిని ప్రభుత్వం ఎందుకు నడపాలి అంటూ తన మద్దతుదారులైన మీడియా సంస్థల్లో రోజూ వార్తలు రాయిస్తారు. అయ్యో పాపం అనేలా ప్రజల్లో అభిప్రాయాలు కలిగిస్తారు. చివరికి అది అమ్మేస్తే మనకు భారం పోతుంది అనేలా జనంలోకి ఒక అభిప్రాయాన్ని బలంగా తీసుకు వెళ్తారు. మొత్తానికి మన మేధావి వాటిని అమ్మేసి మన రాష్ట్రానికి భారం తగ్గించారు.. అని జనంతోనే చెప్పిస్తారు. ఈ విధంగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 54 సంస్ధలను అమ్మేశారు. అది కూడా తన అనుచరులు, తన బినామీలకు పావలాకు అర్ధరూపాయికి ఎన్నో సంస్థలు అమ్మేశారు ఈ విజనరీ

విద్యుత్ చార్జీల పెంపు, బషీరాబాగ్ కాల్పులు: 

కేవలం ప్రపంచ బ్యాంకు సూచనల మీద పాలన చేసి, ప్రజలను గాలికి వదిలేసినా చంద్రబాబు ఆ ప్రపంచ బ్యాంకు డైరెక్షన్ మేరకు విద్యుత్ చార్జీలు భారీగా పెంచారు. దీంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆందోళన చేశారు అది కాస్తా కాల్పులకు దారితీయగా ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన బషీర్ భాగ్ విద్యుత్ ఉద్యమ కాల్పులు పేరిట చరిత్రలో బలంగా నిలిచిపోయింది. 

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఈయన చలవే  

అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ? అంతేసి జీతాలు దేనికి అనే భావనలో ఉండే చంద్రబాబు రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చారు. తన హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసేసి అన్ని శాఖల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారు. అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగి చేసే పనులు ఈ అవుట్ సోర్సింగ్ కుర్రాడితో చేయించి కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారు. ఇప్పటికీ అదే అవుట్ సోర్సింగ్ విధానం ఆంధ్రాలో కొనసాగుతోంది. వీరి జీవితాలు చివరివరకూ అదే తక్కువ జీతాలతో కొనసాగక తప్పని పరిస్థితి 

ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు :

అసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత సేవలు ఎందుకు? ఎంతోకొంత యూజర్ చార్జీలు వసూలు చేద్దాం అనే ఆలోచనలో రోగుల నుంచి సైతం కొంత ఫీజు వసూలు చేసే యూజర్ చార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబే. దీంతో ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఆస్పత్రిలోనూ ఈ యూజర్ చార్జీలు వసూలు చేస్తూ వస్తున్నారు. 

బాబు జమానా అవినీతి ఖజానా

చంద్రబాబుతో అప్పట్లో పొత్తులో ఉండే కమ్యూనిష్టు నాయకులూ సైతం చంద్రబాబు దాష్టీకాన్ని , కార్పొరేట్ తరహా పనులను భరించలేక, అయన అవినీతిని కప్పి పుచ్చలేక బాబు జమానా అవినీతి ఖజానా అంటూ పెద్ద పుస్తకమే రాశారు. ఇందులో బాబు పాలన ఎంత డొల్ల అనేదాన్ని స్పష్టంగా వివరించారు. 

విద్య ప్రయివేటీకరణ

అసలు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు విద్యావ్యవస్థ నాశనం అయింది. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు లేవు.. కొత్త భవనాల నిర్మాణం అడ్మిషన్లు తగ్గిపోయాయి.  అదే సమయంలో లక్షలు పోస్ట్ తప్ప అక్షరం నేర్పని కార్పొరేట్ స్కూళ్ళు వీధివీధినా వెలిశాయి. మధ్యతరగతివాళ్ళు సైతం అప్పు చేసి అయినా సరే కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు తమ బిడ్డలను పంపాల్సిన పరిస్థితి. అంతేకాకుండా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అంటూ తన కార్పొరేట్ తరహా భావాలను అయన మనసులోని మాట అనే పుస్తకంలో ఘనంగా ప్రస్తావించారు. 

ఇలాంటి అరాచక భావాలు, అబద్ధాలు, వ్యవస్థలను ధ్వంసం చేసే చంద్రబాబు తీరును చూసిన స్వీట్ జర్ లాండ్ ఆర్ధికమంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ ఇలాంటి అబద్ధాలకోరులను మా దేశంలో ఐతే జైల్లో కానీ , పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాళ్ళం అన్నారు. అంటే చంద్రబాబు పాలనా ఏ మాదిరిగా ఉందో అర్థం అవుతోంది. 

ఏది విజన్ ?

చంద్రబాబు నిజంగా విజనరీ అయితే రాష్ట్రం విడిపోయి అప్పటికే అప్పులు, అవస్థల్లో ఉన్న ఆంధ్రకు ప్రత్యేకంగా భారీ రాజధాని ఎందుకు ? లక్షల కోట్ల ఖర్చు ఎందుకు? ఇప్పటీకే అభివృద్ధి చెందిన విశాఖ ఉందిగా. రోడ్లు, రైలు మార్గాలు.. విమానమార్గాలు ఉన్న నగరంలోనే కొన్ని భవనాలు కడితే అదే అదే రాజధాని అయ్యేది కదా.. అది లేకుండా లక్షలకోట్ల ఖర్చయ్యే అమరావతి రాజధాని అంటూ మూడు పంటలు పండే పచ్చని భూములులను రాజధానికి సేకరించి దాన్ని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మారుస్తారా ? ఇదేనా విజన్ ?

ఆంధ్రకు అత్యంత పొడవైన తీరరేఖ ఉంది. అక్కడ పరిశ్రమలు... సముద్ర ఆధార వ్యవస్థలు ఏర్పాటు చేస్తే ఎన్నో ఉద్యోగాలు వస్తాయి... రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది. మరి అంట గొప్ప విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క పోర్ట్ అయినా కట్టారా ? అదేనా విజన్ ? ఏమీ అనుభవం లేదు అని చంద్రబాబు తరచూ విమర్శించే జగన్ ఎన్ని పోర్టులు కడుతున్నారు. ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు.. ఇది కాదా విజన్. 

చంద్రబాబుకు నిజంగా ప్రజల మీద ఎలాంటి ప్రేమ, బాధ్యత లేదు.. ఎంతసేపూ తన అనుచరులు, అనుయాయుల లబ్ది, వారికి దోచిపెట్టడం మినహా వేరే ఆలోచన లేదు.

Vision 2047 will be a disaster:

Babu vision 2020 will destroy the state
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs