Advertisement
Google Ads BL

సురక్ష పథకం సూపర్ హిట్


గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టని ఓ అద్భుత కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రభుత్వ సేవలు మరింత సులభతరం కావాలని  సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన ఓ ప్రత్యేక ప్రయత్నం నెలపాటు కొనసాగి మొన్ననే ముగిసింది. అయితే ఈ మహా ఉద్యమంలో ఎంతోమంది వాలంటీర్లు , సచివాలయ, రెవెన్యూ సిబ్బంది స్వయంగా పాల్గొని ప్రతి కుటుంబాన్ని పలకరించి, వారికి ప్రభుత్వంతో ఉన్న పనుల వివరాలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. జగనన్న సురక్ష అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా జులై 1 నుంచి 31 వరకు నెలరోజులపాటు ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకువచ్చే ఈ ప్రత్యక కార్యక్రమం మొన్ననే ముగిసింది. 

Advertisement
CJ Advs

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15,004 గ్రామా సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. విద్య సంవత్సరం ప్రారంభం ప్రారంభం అయిన నేపథ్యంలో విద్యార్థులకు అవసరం అయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి ఇతర ధ్రువీకరణ పత్రాలకు అక్కడే దరఖాస్తులు స్వీకరించడం,  ఇంటింటికి వెళ్లి వెనువెంటనే అక్కడికక్కడే వాటిని మంజూరు చేయడం వంటి  ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు, సమయాన్ని అదా చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టింది.  గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఈ క్రమంలో 93, 57, 707 సర్టిఫికెట్స్ మంజూరు చేసారు. దాదాపు 5. 3 కోట్ల మందికి చేరువ అయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1, 46, 27, 905 కుటుంబాలను కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికెట్స్ , ఇంకా రేషన్ కార్డు లో మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు . 

ఆరోజుల్లో సర్టిఫికెట్ అంటేనే ఓ పెద్ద ప్రయాస 

సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఇలా సర్టిఫికెట్స్ సులువుగా వస్తున్నాయి కానీ ఐదేళ్ల క్రిందట ఐతే విద్యార్థులకు ఈ సర్టిఫికెట్స్ తీసుకోవడం ఒక పెద్ద ప్రయాస అయ్యేది. విద్య సంవత్సరం ప్రారంభములో పిల్లలు పలు కాలేజీలు, యూనివర్సిటీలు . హాష్టల్లు వంటి చోట చేరడం, రిజర్వేషన్ కోటాలో ఇంజినీరింగ్ , మెడిసిన్, ఇంకా ఫార్మసీ, ఎంబీఏ వంటి పెద్ద కోర్సుల్లో చేరడం కూడా ఈ రెండు మూడు నెలల్లోనే ఉంటుంది. కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు ఆయా మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈసేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్ళీ వచ్చేవరకూ ఎదురుచూపులు ఉండేవి. కొన్నిసార్లు మండల, రెవెన్యూ అధికారులు ఇతర పనుల్లో అంటే సర్వ్ పనులు, ఉన్నతాధికారులు, మంత్రుల టూర్లలో బిజీగా ఉంటె పాపం విద్యార్థులకు ఎదురుచూపులే ఉండేవి. సర్టిఫికెట్ ఉంటే రిజర్వేషన్ కోటాలో సీట్, హాష్టల్ వంటివి వస్తాయి. అవి సరైన రోజుకు సమర్పించకపోతే సీటు పోతుంది. ఒకేసారి వందలాది సర్టిఫికెట్స్ ఇవ్వడం కూడా మండల స్థాయి అధికారులకు కష్టమే అయ్యేది. ఇప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో లక్షలాది మంది విద్యార్థులకు వెనువెంటనే సర్టిఫికెట్స్ ఇచ్చి వారికి పనులు సులభతరం చేసారు. వారు సైతం జయహో జగనన్న అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Suraksha scheme is a super hit:

AP CM launches Jagananna Suraksha programme
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs