నారాయణ కాలేజీల చైర్మన్, మాజీ మంత్రి పొంగూరు నారాయణపై ఆయన తమ్ముడి భార్య చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించారని, హింసించారని ఆయన మరదలు ప్రియ పొంగూరు సోషల్ మీడియా వేదికగా చేసిన ఆరోపణలు, వీడియోలు రాష్ట్రంలో విస్తృతంగా సర్క్యులేట్ అయ్యాయి. ఈ విషయంపై రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి సంక్షేమానికి కంకణం కట్టుకున్నాను అని చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్ రెండ్రోజులుగా చప్పుడు చేయడం లేదు. అదేంటి రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు నారాయణ, తన మరదలు పట్ల వ్యవహరించిన తీరుపై కిక్కురుమనకపోవడం చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటూ వైసీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు.
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పార్టీలోనివారిని, కుటుంబీకులను లేదా ఆర్థిక సాయం చేసిన నెపంతో బయటివారిని సైతం లైంగికంగా లేదా శారీరకంగా మానసికంగా వేధిస్తుంటారనే ప్రచారం ఎప్పటినుండో ఉంది. అవసరానికి పేదలకు పదివేలు అప్పు ఇచ్చి లక్షరూపాయలు వసూలు చేసింది చాలక తల్లీ బిడ్డను, ఒకే ఇంట్లోని అక్కాచెల్లెళ్లను లైంగికంగా హింసించిన ఘటనలు కోకొల్లలు. విజయవాడ కాల్ మనీ కేసు అప్పట్లో రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. నారాయణ ఏకంగా తన తమ్ముడి భార్య ప్రియను లైంగికంగా వేధించడం సంచలనం అయ్యింది.
ఇదిలా ఉండగా తమకు , తమ ప్రతిష్టకు భంగం కలుగుతున్నదని గుర్తించిన మరుక్షణమే తమ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి పెద్దలు అసలు విషయాన్ని నీరుగారుస్తారు. అయితే నారాయణ పై అరోపణలు చేస్తున్న ఆయన తమ్ముడు భార్య ప్రియా పొంగూరుకు పిచ్చి ఉండదని, అందుకే ఆమె ఏదేదో మాట్లాడుతున్నారని ఆమె భర్త, నారాయణ సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం చెప్పడం చూస్తే ఇదేదో కావాలని పథకం రచించి చెప్పిఅంట్టుగా ఉంది అంటున్నారు. అంటే ఆమె పిచ్చిది కాబట్టి అలా మాట్లాడుతోంది కాబట్టి.. ఆ మాటలకు విలువలేదు.. పట్టించుకోవద్దని చెబుతూ ఆ అంశాన్ని డైల్యూట్ చేస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.
వాస్తవానికి ప్రియ పొంగూరు జనసేన సానుభూతిపరురాలు అని అంటున్నారు. గతంలో వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ వివాదాస్పద కామెంట్స్ చేసినపుడు ప్రియ ఆయనకు అండగా నిలబడ్డారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశం మీద పవన్ చేసిన ఆరోపణలు, లేవనెత్తిన ప్రశ్నలకు ప్రియా మద్దతు తెలుపుతూ పవన్ అడిగిన సందేహాలకు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పోస్టర్, ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అయితే జనసేనకు మద్దతుగా నిలిచిన మహిళా ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతుంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం లేదా.. వీర మహిళకు అన్యాయం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోరా అంటూ మరికొన్నారు పవన్ ని ప్రశ్నిస్తున్నారు.