విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ భారీ హిట్ కొట్టారు. కొన్నేళ్ల తర్వాత కమల్ కి విక్రమ్ హిట్ ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందం కమల్ హాసన్ మాటల్లో చూపించడం లేదు చేతల్లో చూపిస్తున్నారు. నిన్నటికి నిన్న విక్రమ్ తో తనకి అదిరిపోయే అద్భుతమైన హిట్ ఇచ్చిన లోకేష్ కానగరాజ్ కి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చి వార్తల్లో నిలిచిన కమల్ హాసన్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ కి భారీ కానుకలు ఇవ్వడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
గతంలో అల్లు అర్జున్ పుష్ప టీం సభ్యులకి ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చారు. రామ్ చరణ్ కూడా అలానే ట్రిపుల్ ఆర్ లోని కొంతమంది కి బంగారు నాణాలు బహుకరించినట్టుగా కమల్ హాసన్ విక్రమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కి ఖరీదైన లగ్జరీ 160 (Apache RTR 160)బైక్‌లను కానుకలుగా ఇచ్చారు. ఒక్కో బైక్ రేట్ దాదాపుగా 1.45 లక్షలు ఉంటుందని సమాచారం. లోకేష్ కనగరాజ్ తో పాటుగా ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేసిన వీరికి కమల్ హాసన్ ఇలా కాస్ట్లీ బైక్స్ ని గిఫ్ట్ గా ఇవ్వడం చూసిన వారు కమల్ మనసు ఎంత మంచిదో.. విక్రమ్ లాభాలను వెనకేసుకోకుండా ఇలా చేస్తున్నారు అంటూ పొగిడేస్తున్నారు.