Advertisement
Google Ads BL

మహేష్ ప్రాజెక్ట్ పై రాజమౌళి అప్ డేట్


రాజమౌళి ప్రస్తుతం ట్రిపుల్ ప్రమోషన్స్ హీట్ లో ఉన్నారు. గత పది రోజులుగా నిద్ర కూడా మానుకుని ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఆయన రెండున్నరేళ్లు షూటింగ్ తో సెట్స్ లో ట్రిపుల్ ఆర్ కోసం ఎంతగా కష్ట పడ్డారో.. ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ రాజమౌళి అంతే కష్టపడుతున్నారు. షూటింగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒళ్ళు హూనమైపోయి ఎంతగా శ్రమని చిందించారో.. ఇప్పుడు ప్రమోషన్స్ లోను అలానే నిద్రకి కరువై సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నారు. అయితే రాజమౌళి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో ఆ సినిమా మీద తప్ప మిగతా విషయాలేమి మాట్లాడడం లేదు. కానీ ఆయనకి తన తదుపరి మహేష్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ పై చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

Advertisement
CJ Advs

మొన్న కన్నడ మీడియాతో మహేష్ తో చెయ్యబోయే మూవీ మల్టీస్టారర్ కాదు సింగల్ స్టార్ అని చెప్పిన రాజమౌళి రీసెంట్ గా బాలీవుడ్ మీడియాలో తో మహేష్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ విషయమై స్పందించారు. మహేష్ తో చెయ్యబోయే సినిమా మాములుగా ఉండదు అని, ఇప్పుడు వస్తున్న ట్రిపుల్ ఆర్, అలాగే రికార్డులు సెట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలిని మించి భారీ స్థాయిలో ఉండబోతుంది అంటూ రాజమౌళి మహేష్ ప్రాజెక్ట్ అప్ డేట్ ఇవ్వడంతో మహేష్ ఫాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. 

ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ మూవీ కథని రెడీ చేశాను, రాజమౌళి ఓకె చెయ్యాలని, ఈ మూవీ హాలీ వుడ్ స్టయిల్లో, ఆ రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పారు. ఇప్పుడు రాజమౌళి కూడా అదే చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశంలో తేలుతున్నాయి.

Mahesh, Rajamouli project double than Baahubali and RRR:

Mahesh and Rajamouli for international sensation?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs