Advertisement
Google Ads BL

రాధేశ్యామ్ టీజర్ హైలైట్స్


ప్రభాస్ - పూజ హెగ్డే కాంబోలో జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ రాధేశ్యామ్ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ గా పూజ హెగ్డే ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇక నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో రాధేశ్యామ్ నుండి ప్రభాస్ కి టీజర్ తో బర్త్ డే విష్ చేసింది టీం. ఎప్పటినుండో రాధేశ్యామ్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి ప్రభాస్ బర్త్ డే ట్రీట్ కింద రాధేశ్యామ్ టీజర్ వదిలారు. రాధేశ్యామ్ టీజర్ లో మెయిన్ హైలైట్ ప్రభాస్. ప్రభాస్ వాయిస్ ఓవర్ తో టీజర్ కట్ చేసారు. ప్రభాస్ విక్రమాదిత్యగా తన కేరెక్టర్ ని రివీల్ చేసుకున్నాడు.

Advertisement
CJ Advs

ప్రభాస్ నువ్వు ఎవరో నాకు తెలుసు. కానీ నీకు చెప్పను. నీ హృదయం ఎప్పుడు ముక్కలవుతుందో నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ ఓటమి నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నీ చావు నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. నాకు అన్నీ తెలుసు. కానీ నీకు చెప్పను. ఎందుకంటే, చెప్పినా మీ ఆలోచనలకు అందదు. నా పేరు విక్రమాదిత్య. నేను దేవుడిని కాదు. మీలో ఒక్కడిని కూడా కాదు..అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ తో రాధేశ్యామ్ టీజర్ ని చూపించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా విజువల్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ప్రభాస్‌ విక్రమాదిత్య గా పాల్మీస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రాధేశ్యామ్ సంక్రాతి స్పెషల్ గా జనవరి 14 న రిలీజ్ కాబోతున్నట్టుగా మరోసారి కంఫర్మ్ చేసింది టీం. 

Radhe Shyam teaser highlights :

Prabhas Radhe Shyam teaser released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs