Advertisement
Google Ads BL

పవన్‌ విషయంలో స్పందనలు ఇలా ఉన్నాయి..!


పవన్‌ కళ్యాణ్‌ జనసేన కూడా దొడ్డిదారిన బిజెపికి మద్దతు ఇస్తోందని పలువురు అనుమానిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్‌కి అండగా నిలిచాడు సిపిఐ నేత నారాయణ. ఆయన మాట్లాడుతూ, పవన్‌కి బిజెపితో ఎలాంటి సంబంధం లేదని తాను ఖచ్చితంగా చెప్పగలను. కానీ జగన్‌ మాత్రం బిజెపి విషయంలో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాడు. జగన్‌ బిజెపితో కుమ్మక్కు అవుతున్నాడు. వైసీపీ, జగన్‌ కంటే వందరెట్లు పవన్‌కళ్యాణ్‌ జనసేన బెటర్‌. ఇక మోదీ ఫోన ట్యాంపరింగ్‌ కేసులో కేసీఆర్‌ని, ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని విచారించే దమ్ము మోదీకి ఉందా? అని ప్రశ్నించాడు. 

Advertisement
CJ Advs

ఇక పవన్‌ విషయమై ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ, ప్రజలకు మంచిచేయాలని పవన్‌ రాజకీయాలలోకి వచ్చారు. కానీ ఆ పార్టీలో చేరే వలస నేతల పట్ల పవన్‌ జాగరూకతతో ఉండాలి. ప్రజలకు మంచి చేయాలని చూస్తున్న పవన్‌ని స్వాగతిద్దామని చెప్పాడు. ఇక ఏపీకి అన్ని విధాలుగా చంద్రబాబు బాగా చేస్తున్నాడు. కానీ కేంద్రం నిధులు ఇవ్వకపోవంతో ఆయనేమీ చేయలేకపోతున్నాడు. ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన మోదీ మాట మార్చాడు. ఈ స్థితిలో చంద్రబాబు మాత్రం ఏమి చేయగలరు? కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కేంద్రం సాయం లేకుండా ఎలా ముందుకు వెళ్తుంది? అని ప్రశ్నించాడు. 

ఇక తాజాగా పవన్‌ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా యాత్రకు సిద్దం అవుతున్నాడు. పవన్‌ యాత్ర రూట్‌మ్యాప్‌ కూడా రెడీ అయింది. ఆయన కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్దం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆ యాత్ర పేరు, పర్యటన వివరాలు, తేదీలు, దేనికోసం యాత్ర చేయనున్నాడు? యాత్ర ఎక్కడ నంచి ప్రారంభం కానుంది అనేవి తెలియనున్నాయి. యాత్రలో భాగంగా స్థానిక సమస్యలను తెలుసుకోవడం. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడితేవడం, ఈ విషయంలో పార్టీ విధానం ఏమిటో అక్కడిక్కడే ప్రకటిస్తారని తెలుస్తోంది. వచ్చే ఎన్కిల్లో అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని చెప్పిన పవన్‌ ఈ రాష్ట్ర పర్యటన ద్వారా పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాడు.

Pawan Kalyan Route Map Confirmed:

Pawan Kalyan Route Map Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs