Advertisement
Google Ads BL

శివాజీ... వీడు మగాడ్రా బుజ్జి!


హీరో శివాజీ...  ఆయనకు చంద్రబాబు లాంటి రాజకీయ అనుభవం లేకపోవచ్చు.  పవన్‌కళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్‌ లేకపోవచ్చు. కానీ ఆయన ప్రత్యేక హోదా విషయంలో చేసిన కామెంట్లు అందరినీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఆయనకు ఉన్న ఆవేదన, బాధ చూసిన వారికి ఎవరికైనా అందరికంటే వీడు మగాడ్రా బుజ్జి అనిపించకమానదు. పవన్‌లాగా ఏసీ రూముల్లో కూర్చొని ట్వీట్స్‌ చేయడం, బిజెపిని నొప్పించకుండా ఆచితూచి మాట్లాడటం, చంద్రబాబు అసలే స్పందించకపోవడం, కేవలం తన మంత్రులు, ఎమ్మేల్యేల చేత మొక్కుబడిగా మాట్లాడించడం తప్ప ఈ విషయంలో వారు పెద్దగా బిజెపిని టార్గెట్‌ చేయలేకపోయారు. కానీ హీరో శివాజీ మాత్రం ఏపీ ప్రత్యేక హొదా సాధన సమాఖ్య అధ్యక్షునిగా మాట్లాడుతూ..  ఏపీని అంధకారంలోకి నెట్టారు.  ఓ వెధవ సన్నాసి ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని మాట్లాడాడు. బిజెపి సన్నాసుల్లారా..  వినండి...  14వ ఆర్ధికసంఘం బీహార్‌ రాష్ట్రానికి 1లక్ష 60వేల కోట్లు ఇవ్వమని ఎక్కడ చెప్పింది? మరి ఎన్నికలప్పుడు మీరు ఇస్తామన్నారుగా...!  ఇంత జరుగుతున్నా మన ఏపీ ఎంపీలు, రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు, నాయకులు, మన రాష్ట్రానికి సంబంధించిన కేంద్రమంత్రులైన వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, అశోక్‌గజపతిరాజు వంటి వారు ఏమి చేస్తున్నారు? ఇక మనం దేశ ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడటం కూడా అవమానం. ఆయన ఓ ఆర్టిఫిషియల్‌ ప్రధానమంత్రి, ఆయన చేతలు లేని ప్రధాని, రాష్ట్రానికి చెందిన నాయకులు, మంత్రులు, ఎంపీలు డిల్లీలో కార్పొరేట్‌ సంస్థల పైరవీలతో గడుపుతున్నారు. ఆనాడు లోక్‌సభలో తెలంగాణకు చెందిన ఇద్దరే సభ్యులు ఉన్నారు. ఒకరు పార్టీ అధినేత కేసీఆర్‌ కాగా, రెండో వ్యక్తి విజయశాంతి. కేవలం వీరిద్దరే లోక్‌సభను స్తంభింపజేసి తమ సత్తా చాటి చివరకు అనుకున్న తెలంగాణను సాధించారు. కానీ ఏపీ ఎంపీలకు, మంత్రులకు సిగ్గులేదు. మోడీకి ఏపీ అంటే కక్ష్య, చంద్రబాబునాయుడంటే కసి..  అందుకే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారు. కొత్త కొత్త వ్యూహాలతో, రాజకీయ కుయుక్తులతో రాష్ట్రాన్ని మోసం చేయాలని భావిస్తున్నారు.  కానీ ఆయనకు తెలియదేమో..  ఏపీ ప్రజలు చాలా అడ్వాన్స్‌డ్‌ పీపుల్‌. కాంగ్రెస్‌కు పట్టిన గతే...  బిజెపికి కూడా పడుతుంది. బిజెపితో కలసి ఉంటే టిడిపికి డిపాజిట్లు కూడా రావు. వెంటనే ఆ పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అందరు ఎంపీలను కలుపుకొని ముందుకు సాగాలి..  అంటూ తన మాటలతో హడలెత్తించాడు. ఇక ఆయన మరింత ఘాటుగా ఆంద్రప్రదేశ్‌ను దేశం నుండి విడగొట్టండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి నాయకులు శివాజీ ఇలా మాట్లాడటం రాజద్రోహం కిందకు వస్తుందని, పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామంటే..  మీ ఇష్టం ఏమైనా చేసుకొండి. నేను భయపడేది లేదు. మిమ్మల్ని చూసి భయపడేంత పిరికివాడిని నేను కాదు..  అంటూ స్పందించాడు శివాజీ. హ్యాట్సాఫ్‌ శివాజీ..  ఏపీ ప్రజల మనోగతాన్ని తన మాటలతో చెప్పిన శివాజీని చూసి అందరూ గర్వంగా ఫీలవుతున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs