Advertisement
Google Ads BL

మైసురాను కోవర్ట్‌ అనడం సమంజసమేనా!


రాష్ట్రంలో ఇప్పుడున్న నాయకులలో మైసూరారెడ్డికి ఓ ప్రత్యేకస్దానం ఉంది. ఆయనకు వాక్చాతుర్యం లేకపోవచ్చే గానీ రాజకీయాలపై క్షుణ్ణమైన పరిజ్ఞానం ఆయన సొంతం, ఎవరి మీద అనవసరంగా నిందలు మోపడం, రాజకీయ ఎత్తుగడలు, ఇతర అవినీతి విషయాలకు ఆయన చాలా దూరం. అందుకే ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయన ఆ పార్టీకి పెద్ద ఎస్సెట్‌గా భావిస్తారు. అలాంటి మైసూరారెడ్డి వైయస్సార్‌సీపీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అందునా ఆయన జగన్‌కు రాసిన లేఖ, మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. ఆయనపై వైసీపీ నేత, ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు. తన సిమెంట్‌ కంపెనీల అనుమతుల కోసం, ఇతర ప్రలోభాలకు లొంగే మైసూరా పార్టీని వీడారన్నారు. గత ఆరునెలలుగా ఆయన వైసీపీలోనే ఉంటూ తమ పార్టీ ఎమ్మేల్యేలకు ఫోన్లు చేసి టిడిపిలో చేరేందుకు వ్యూహం పన్నారనేది ఆయన వాదన, మైసూరారెడ్డి చెప్పినట్లుగా జగన్‌ అపరిచితుడు కాదని, ఆయన డబ్బు మనిషి కాదని, పెద్దలకు ఆయన ఎంతో గౌరవం ఇస్తారని, ఈ తప్పుడు అలవాట్లన్నీ మైసూరారెడ్డికే ఉన్నాయని ఆయన విమర్శించారు. కానీ మైసూరా గత జీవతం గురించి తెలిసిన ఎవ్వరూ అలాంటి ఆరోపణలను నమ్మే 

Advertisement
CJ Advs

పరిస్థితి లేదు. జగన్‌ జైలులో ఉన్నప్పుడు అన్నికార్యక్రమాలను తన భుజాలపై వేసుకొని మోసి పార్టీని ముందుకు నడిపించింది మైసూరారెడ్డే అని అందరికీ తెలుసు, వాస్తవానికి ఓ సీనియర్‌ నేతగా తన మాటకు విలువ ఉండాలని మైసూరా భావించడంలో తప్పులేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఓనమాలు తెలియని, జగన్‌తో సహా పలు కేసుల్లో నిందుతునిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వకపోవడం మైసూరాను బాధించే విషయమే. ఆ స్ధానంలో ఎవరు ఉన్నా అలాగే ఫీలవుతారు. ఇక రాజ్యసభ సీటు కోసం తాను పార్టీని వీడటం లేదని వైసూరా చెప్పారు. ఎందుకంటే ఆయనకు పదవులు కావాలంటే ఎవరైనా ఇస్తారు. ఆయన పదవులకు కొత్త కాదు. కేవలం రాజ్యసభ సీటు విషయమే మానవతా దృక్పథం కాదని, మానవతా విలువలంటే ఏమిటో జగన్‌కు తెలియదని మైసూరా వ్యాఖ్యానించాడు. తన కొడుకు వయసు ఉన్న జగన్‌ తనను తీవ్రంగా అవమానించాడని చెబుతూనే, వాటన్నింటిని ఇప్పుడు బయటపెట్టడం సమంజసం కాదని హుందాగా వ్యవహించాడు మైసూరా..! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs