Advertisement
Google Ads BL

నాయకులు హోంవర్క్‌ చేయరా...?


ఏ రాజకీయనాయకుడైనా ప్రతి నిత్యం హోంవర్క్‌ చేయడం, రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ముఖ్యం. దేశంగా గొప్ప గొప్ప నేతలుగా ఎదిగిన అందరూ ఇలా హోంవర్క్‌ చేసినవారే. పివి నరహింహారావు, వాజ్‌పేయ్‌, ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌, వెంకయ్యనాయుడు వంటి వారు తమ హోంవర్క్‌తో అప్‌డేట్‌ అవుతూ అదరగొట్టే ప్రసంగాలు చేయగలిగారు. కానీ కొందరు నేతల్లో మాత్రం ఈ లక్షణం కనపడటం లేదు. ప్రెస్‌మీట్స్‌తో పాటు ప్లీనరీ వంటి అతి కీలకమైన సందర్భాల్లో కూడా వారు ఎలా మాట్లాడాలి? ఏయే విషయాలు మాట్లాడాలి? ప్రత్యర్థులకు ఎలా కౌంటర్‌ ఇవ్వాలి? అనే విషయాలను లైట్‌గా తీసుకుంటున్నారు. రెండురోజుల కిందట ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. తెలంగాణలో టిడిపి నేతలు, ఆంద్రప్రదేశ్‌లో వైయస్సార్‌సీపీ నేతలు ప్రలోభాలకు లొంగే పార్టీలు మారుస్తున్నారని అన్నాడు. ఆ వెంటనే మరలా తప్పును కవర్‌ చేస్తూ తమ నాయకుడు చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే వైయాస్సార్‌సీపీ నాయకులు తమ పార్టీలోకి వచ్చారని చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇక మాజీ కాంగ్రెస్‌ నేత, సీనియర్‌ నాయకుడు, టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, జనరల్‌సెక్రటరీగా బరువు బాధ్యతలు మోస్తున్న కెకె (కె.కేశవరావు) నిన్న జరిగిన టిఆర్‌ఎస్‌ ప్లీనరీ సందర్బంగా ప్రసంగిస్తూ, పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలపై ఉందని సెలవిచ్చాడు. ఈ తప్పును గమనించిన వారి ముందు సిగ్గుపడటం కేకే వంతైంది. వెంటనే తప్పును సరిచేసుకొని పార్టీ కార్యక్రమాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై ఉందని వివరణ ఇచ్చాడు. మొత్తానికి ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఎలా సంపాదించాలా? అనే ఆలోచన తప్ప ఎప్పటికప్పుడు హోంవర్క్‌ చేస్తూ, రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా చేయక అందరి ముందు అభాసుపాలవుతున్నారు కొందరు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs