వేమూరి రాధాకృష్ణ నేతృత్వంలో ఆంధ్రజ్యోతి ఒక ఎక్స్ ప్లోజివ్ దినపత్రికగా, టీవీ చానలుగా పేరు పొందింది. తెలుగుదేశం మద్దతుదారుగా పేరుపడ్డ రాధాకృష్ణ అంటే మొదటి నుండి ముఖ్యమంత్రి కేసిఆర్ అండ్ తెరాసాలకు మింగుడు పడనివాడే. ఇది ఎంతదాకా వెళ్లిందంటే ఏబీఎన్ చానలుకు తెలంగాణలో అయిదు వందల రోజుల నుండి సంకెళ్ళు వేయబడ్డాయి. దీని వెనక కారణం ఎవరా అని ఆరా తీయాల్సిన పనిలేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే.
తాజాగా ఆంధ్రజ్యోతి కవర్ చేస్తున్న కేసిఆర్, సహారాల కథనం సంచలనంగా మారింది. సెంట్రల్ మినిస్టరుగా ఉన్న రోజుల్లో కేసిఆర్ చేసిన ఒక్క సంతకంతో సహారాలోని లక్షలాది ఉద్యోగుల పీఎఫ్ లావాదేవీల్లో అవకతవకలు జరిగి సుబ్రత రాయ్ కటకటాలు లెక్కేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సిబీఐ కూడా రంగంలోకి దూకి కేసు విచారణ చేపట్టింది. తొందరలోనే కేసిఆర్ గారిని ప్రశ్నించే అవకాశం కూడా ఉందన్నది వాస్తవ అంశం.
కేసిఆర్ నోరు మెదపకుండా ఉండడంతో ప్రతిపక్షాలు తమ నోటీకి తీవ్రమైన పని పెట్టాయి. వీటికి ఆంధ్రజ్యోతి కూడా నోరు కలిపింది. పెరిగిపోతున్న ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో కం-జాయినుడ్ ట్విన్స్ వీణావాణిల పేరుతో లక్షలు వసూలు చేసి, అన్నింటినీ రాధాకృష్ణ బొక్కాడు అని టీ న్యూస్ ఇప్పుడు దండోరా వేసి మరి చెబుతోంది. ఈ ప్రచారం వాళ్ళ ఎంతవరకు రాధాకృష్ణ బద్నాం అవుతాడో పక్కన పెడితే కేసిఆర్ చేతిలో ప్రభుత్వం వుంది... రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు... కథనంతా గమనిస్తున్న కేసిఆర్ గమ్మున ఉంటాడా లేక రాధాకృష్ణ మీద ఇంకేదైనా పెద్ద స్కెచ్ వేస్తాడా అన్నది, పాలిటిక్స్ వెర్సస్ మీడియాలో వెయిట్ అండ్ సీ.