ఎర్రకోటపై ‘అరుణతార’ జ్యోతిబసు జెండా ఎగరేసే మహదవకాశాన్ని చేజార్చారు సూర్జిత్‌సింగ్Ñ
మన్మోహన్‌సింగ్ కేంద్రప్రభుత్వ రధానికి రెండు చక్రాల్లా వున్న వామపక్షాలు ‘అణు’వంత వివాదంతో ఈ దేశ దశ దిశని నిర్దేశించే క్రియాశీలక పాత్రను కాలదన్నుకున్నారు. తెలంగాణ సాయుధపోరాటసారధికి ఇప్పుడు తెలంగాణలో మనుగడ ప్రశ్నార్ధకమయింది.
అంతటి ఘనచరిత్ర వున్న వామపక్షాలు కార్మికులకు, కర్షకులకు, బడుగులకు, మొత్తంగా ప్రజలకు దూరమయ్యారు. దేశంలో ‘కాంగ్రెసు ` బిజెపి’ అన్న రెండు పార్టీలే దిక్కు అనుకుంటున్న స్థితిలో థర్డ్‌ఫ్రంట్ ఆలోచన ఓ ఫార్సుగా తయారయింది. ఈ స్థితిలో కాంగ్రెసు ` వామపక్షాలు చేయలేనిది ఓ సామాన్యుడు చేశాడు. ‘ఆమ్ ఆద్మీ’ పార్టీనేత కేజ్రీవాల్ దేశ రాజధాని ఢల్లీిలో మోదీకి చెమటలు పట్టిస్తున్నాడు. గెలుపోటములను పక్కన పెడితే, కేజ్రీవాల్‌ని నమ్ముతున్న సగటు మనిషి వామపక్షాలను ఎందుకు నమ్మడంలేదు? కేజ్రీవాల్ సక్సెస్ అయినచోట మిగతావారు ఎందుకు మౌనంగా వుండి పోయారు? అన్నది అధ్యయనం చేయాలి.
ఒక ‘ఐ ఆర్ ఎస్’ కేజ్రీవాల్ సక్సెస్ అయినచోట మరో ‘ఐఎఎస్’ జయప్రకాష్ నారాయణకి (లోక్ సత్తా) డిపాజిట్‌కూడా దక్కక పోవడానికి కారణం?
భారతదేశంలో ` ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది అనడానికి ఓ గొప్ప నిదర్శనం : కామన్‌మాన్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను గడగడలాడిరచడమే! హేట్సాఫ్ టు యూ ` కేజ్రీ!