అల్లు అర్జున్-అట్లీ మూవీ ముంబై లో సైలెంట్ గా కార్యక్రమాలు జరుపుకోవడం అభిమానులకు పెద్ద షాకిచ్చింది. అట్లీ తో అల్లు అర్జున్ చెయ్యబోయే AA 22 అనౌన్సమెంట్ వీడియోనే భారీగా అంటే ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్లాన్ చేసిన టీమ్ పూజా కార్యక్రమాల విషయంలో ఎందుకింత సైలెన్స్ ని మైంటైన్ చేసారని అనుకున్నారు.
ఇక అల్లు అర్జున్ - అట్లీ AA 22 లో హీరోయిన్స్ గా రెండుమూడు పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో మృణాల్ ఠాకూర్ పేరు హైలెట్ అవగా ఇప్పుడు మరో బాలీవుడ్ భామ అనన్య పాండే AA 22 లో హీరోయిన్ అనే వార్త చూసి అల్లు అభిమానులు షాకవుతున్నారు. లైగర్ చిత్రంతో సౌత్ కి ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే లుక్స్ పై సౌత్ ఆడియన్స్ ఇంప్రెస్స్ అవ్వలేదు.
అనన్య పాండే మరీ పుల్లలా ఉంది, ఏ కోశానా ఆమె హీరోయిన్ గా అనిపించలేదు అన్నారు. ఇప్పుడు అదే అనన్య పాండే ను అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ అనేసరికి అల్లు అభినులు ఉలిక్కి పడడమే కాదు, మాకొద్దు బాబోయ్ ఈ హీరోయిన్ అంటూ మేకర్స్ కి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. చూద్దాం ఈ విషయంలో మేకర్స్ ఎల్ రియాక్ట్ అవుతారో అనేది.