యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నీల్ మూవీ డ్రాగన్ (వర్కింగ్ టైటిల్)షూటింగ్ లో బిజీ అయ్యారు. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ నీల్ తో కలిసి సెట్ లోకి వెళ్లారు. ప్రస్తుతం బెంగుళూర్ సమీపంలో ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ షూటింగ్ చిత్రీకరణ జరుగుతుంది. అయితే ఎన్టీఆర్-నీల్ చిత్రంపై ఇప్పుడొక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్.
అది ఎన్టీఆర్-నీల్ కాంబో డ్రాగన్ చిత్ర షూటింగ్ మొదలు పెట్టకముందే ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 2026 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రశాంత్ నీల్ అనౌన్స్ చేసారు. దానితో సంక్రాంతి రిలీజ్ పై అందరిలో అంచాలు పెరగడము, ఇంకా కొన్ని క్రేజీ చిత్రాలు సంక్రాంతి బరిని టార్గెట్ చెయ్యడం మొదలు పెట్టాయి. ఇప్పుడు నీల్-ఎన్టీఆర్ మూవీ ని సంక్రాంతి బరి నుంచి తప్పించి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
2026 సంక్రాంతికి కి కాదు ఎన్టీఆర్-నీల్ డ్రాగన్ వెనక్కి జరుపుతూ సంక్రాంతి వెళ్లిన ఆరు నెలలకు అంటే జూన్ 25, 2026 న ఎన్టీఆర్-నీల్ మూవీ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించారు.