గతంలో అర్జున్ రెడ్డి సమయంలో కాంగ్రెస్ నేత హనుమంతరావు ను చిల్ తాత అన్నందుకు విజయ్ దేవరకొండ పై చాలామంది ఫైర్ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంపై హనుమంత రావు చేసిన కామెంట్స్ పై విజయ్ అప్పట్లో అలా రియాక్ట్ అయ్యాడు. తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ వివాదంలో ఇరుక్కున్నాడు.
రెట్రో ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలపై గిరిజన సంఘాలు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు విజయ్ దేవరకొండ రెట్రో ఈవెంట్ లో ఏం మాట్లాడాడు అంటే.. కశ్మీర్‌లోని పహల్గామ్ ఘటనపై విజయ్ ఆ ఈవెంట్ లో రియాక్ట్ అవుతూ..
ఉగ్రవాదులకు సరైన విద్యను అందించి, వారి ఆలోచనా విధానాన్ని మార్చడమే దీనికి పరిష్కారమని, 500 ఏళ్ల క్రితం గిరిజనులు (ట్రైబల్స్) ఘర్షణ పడినట్లుగా టెర్రరిస్ట్ లు కశ్మీర్‌లో దాడులు చేస్తున్నారని కామెంట్స్ చేసాడు. అయితే తమను ట్రైబల్స్ అంటూ కించపరిచేలా విజయ్ దేవరకొండ మాట్లాడాడు, వెంటనే విజయ్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.