థియేటర్స్ వ్యవస్థను సర్వనాశనం చేసింది ఓటీటీ వ్యవస్థ. కరోనా పుణ్యమా అని ఓటీటీలు ఒక్కసారిగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. థియేటర్స్ కి వెళ్లే సినిమాలు చూడాలా ఓటీటీలో వస్తే ఎంచక్కా ఫ్యామిటో కలిసి ఇంట్లోనే సినిమా చూడొచ్చనే అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేసారు. అందులోను ఒకప్పుడు ఎనిమిది వారాల గ్యాప్ లో థియేటర్స్ నుంచి సినిమాలు ఓటీటీలోకి వచ్చేవి.
కానీ ఇప్పుడు మూడు వారాలు అంటే నెల తిరక్కుండానే థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వస్తున్నాయి. అందుకే చాలామంది ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లడం మానేశారు. ఓటీటీ లో సినిమాలే కాదు వెబ్ సీరీస్ లు, ఇంకా టాక్ షోస్, కుకింగ్ షోస్ ఇలా చాలానే కంటెంట్ ఉంటుంది.
కానీ ఇప్పుడు ఓటీటీలకు కూడా కాలం చెల్లినట్టే కనబడుతుంది. వెబ్ సీరీస్ లు చూసే ఓపికలు లేవు, ఏడు లేదా ఎనిమిది ఎపిసోడ్స్, ఐదు గంటలు, లేదంటే ఆరు గంటలు ఇలా వుండే వెబ్ సీరీస్ లపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ప్రేక్షకుల్లో. ఓటీటీలో వచ్చే సినిమాలు కూడా బావున్న వాటినే ఇష్టపడుతున్నారు తప్ప సో సో గా ఉన్న సినిమాలను టచ్ కూడా చెయ్యడం లేదు.
గతంలో వెబ్ కంటెంట్ పై ప్రేక్షలు చూపించిన మోజు ఇప్పుడు చూపించడం లేదు, అందుకే ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా వెబ్ సీరీస్ ల సీక్వెల్స్ కి మంగళం పాడేస్తున్నాయి. సూపర్ హిట్ వెబ్ సీరీస్ లకి సీక్వెల్ ఇస్తున్నారు కానీ, సో సో టాక్ ఉండే వాటి సీక్వెల్స్ ని పక్కనపడెయ్యడం చూస్తే వెబ్ సీరీస్ లపై డిమాండ్ తగ్గినట్టే కనబడుతుంది.
ప్రేక్షకులకు ఇప్పుడున్న కంటెంట్ చాలడం లేదు, అంతకుమించి కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్స్ మారిపోతున్నారు. ఇది దర్శకులకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. వారు కూడా అంతకుమించిన కంటెంట్ తోనే రావాలి. లేదంటే కష్టం. అందుకే థియేటర్స్ తో పాటుగా ఓటీటీలకు కూడా కాలం చెల్లినట్టే కనిపిస్తుంది.. అనేది.