టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఏం చేస్తుంది. ఈమధ్యనే వెకేషన్ కి వెళ్లొచ్చి తన సినిమాల షూటింగ్స్ చేసుకుంటుంది. గ్యాప్ దొరికిన ప్రతిసారి సోషల్ మీడియాలో ఫ్రెష్ లుక్స్ తో దిగిపోతుంది. తాజాగా రష్మిక మందన్న వదిలిన పిక్స్ చూస్తే ఏముందిరా రష్మిక అంటారు.
బ్లాక్ డ్రెస్ లో క్యూట్ గా కనిపించిన రష్మిక శారీ లో సింపుల్ గా అద్దరగొట్టేసింది. రెండు ఫొటోస్ ఎంతో ఢిఫరెంట్ గా ఉన్నప్పటికీ.. రష్మిక ఫేస్ లో గ్లో మాత్రం సేమ్ టు సేమ్ ఉంది. అందానికి అందం, ఫిట్ నెస్ కి ఫిట్ నెస్ తో రష్మిక లుక్స్ మాత్రం సర్ ప్రైజింగ్ గా ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇక రష్మిక ధనుష్-శేఖర్ కమ్ముల కుబేర చిత్రంతో పాటుగా హీరోయిన్ సెంట్రిల్ ఫిలిమ్స్ తో బిజీగా వుంది. అందులో ఆమె నటించిన హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం గర్ల్ ఫ్రెండ్ కూడా విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం సికందర్ షాక్ తో బాలీవుడ్ లో రష్మిక హావ కి ఏమైనా బ్రేకులు పడతాయేమో అనేది మాత్రం ఇంట్రస్టింగ్ గా మారింది.