నాగ చైతన్య కు భార్యగా అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన సమంత నాగచైతన్య తో కలిసి మురళి మోహన్ దగ్గర ఇల్లు కొని మరీ వేరు కాపురం పెట్టారు. అక్కడే జిమ్ లో చైతు-సమంత కలిసి వర్కౌట్స్ చెయ్యడం చేసేవారు. అంతేకాదు ఇద్దరూ కలిసి హ్యాష్ అనే పెట్ ని కూడా పెంచుకున్నారు. సమంత, నాగ చైతన్య హ్యాష్ తో బాగా టైం స్పెండ్ చేసేవారు.
నాగ చైతన్య-సమంత విడాకులు తీసుకుని విడిపోయాక పెంపుడు కుక్క హ్యాష్ ఒకసారి చైతు దగ్గర మరొకసారి సమంత దగ్గర కనిపించింది. ఇప్పుడు నాగ చైతన్యకు రెండో భార్యగా వచ్చిన శోభిత దూళిపాళ్ల కూడా ఆ హ్యాష్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంది. సండే రోజు రిలాక్స్ అవుతూ శోభిత కనిపించగా శోభిత పక్కనే హ్యాష్ కూడా కనిపించింది.
నాగ చైతన్య శోభితతో హ్యాష్ రిలాక్స్ అవుతున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అప్పుడు సమంత తో కనిపించిన హ్యాష్ ఇప్పుడు శోభితతో కనిపించింది. నాగ చైతన్య సమంతను వదిలేసినా హ్యాష్ ని మాత్రం తన వద్దే ఉంచుకున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.