టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలను రంగుల ప్రపంచంలోనే చూడగలం! ఇక్కడ కొందరి తెలివితేటలు, ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే! `ఒక్క ఛాన్స్ ప్లీజ్` అంటూ అవకాశాల కోసం బెగ్గింగ్ చేసే నటీమణులను లైంగికంగా ఉపయోగించుకుని ఆ తర్వాత వారికి ఆశించిన అవకాశం కల్పించకుండా ఎస్కేప్ అయ్యే వారి గురించి ఇండస్ట్రీలో నిరంతరం కథలు కథలుగా వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే ఇక్కడ ఒక నటితో అశ్లీల చిత్రాల్ని తెరకెక్కించి తనకు ఇవ్వాల్సిన రూ.48 లక్షల పెండింగ్ పారితోషికాన్ని స్కిప్ కొట్టిన ఒక ఫిలింమేకర్ వ్యవహారాన్ని వివరిస్తూ, సదరు నటి వాపోయింది. తనకు దుర్గామాత ఆశీస్సులు ఉన్నాయని ఎలాగైనా అతడి నుంచి ఆ డబ్బును వసూలు చేస్తానని కూడా అంటోంది. ఎవరైనా టాటాలను చూసి నేర్చుకోవాలని, నీతివంతమైన వ్యాపారం చేయాలని, కళాకారులను బెదిరించి డబ్బు దోపిడీ చేయకూడదని సూచించింది. డబ్బు అడిగితే అతడు తనను బెదిరించాడని కూడా వెల్లడించింది.
అతడు ఎంత పెద్దవాడు అయినా కానీ, తన సొమ్ములు ఎలా వసూలు చేసుకోవాలో తనకు బాగా తెలుసును అని కూడా అంది. ఈ నటి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే అనామకురాలిగా ఇండస్ట్రీలో ప్రవేశించి చాలా ఇబ్బందుల్ని వేధింపులను కూడా ఎదుర్కొంది. ప్రతిభ ఉన్నా కానీ తనకు ఆశించిన స్టార్ డమ్ చిక్కలేదు.