బుట్టబొమ్మ పూజ హెగ్డే కి టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. నిన్నమొన్నటివరకు సౌత్ అవకాశాలు లేని పూజ హెగ్డే మరోనాలుగు రోజుల్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో కలిసి రెట్రో మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో వింటేజ్ లుక్ లో శారీ తో కనిపించనున్న పూజ హెగ్డే ఆ సినిమా ప్రమోషన్స్ లోను అంతే చక్కటి శారీ షో చేసింది.
బుట్టబొమ్మ మాదిరి వింటేజ్ లుక్ లో కనబడిన పూజ హెగ్డే హైదరాబాద్ లో జరిగిన రెట్రో ఈవెంట్ లో మిస్ అయ్యింది. రెట్రో ప్రమోషన్స్ పుణ్యమా అని పూజ హెగ్డే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ వదులుతూ ఎక్కడలేని హడావిడి చేస్తుంది. దానితో పాటుగా తమిళనాట విజయ్ చిత్రంలోనూ నటిస్తున్న పూజ హెగ్డే చాలా కాలం తర్వాత తెలుగు ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లుగా రెట్రో ప్రమోషన్స్ లో రివీల్ చేసింది.
రెట్రో చిత్రం కాస్త హిట్ అయినా పూజ హెగ్డే బయటపడిపోతుంది. మళ్లీ అమ్మడు టైమ్ స్టార్ట్ అవుతుంది. రెట్రో టాక్ అటు ఇటు అయితే పూజ హెగ్డే మళ్లీ ఇబ్బంది పడాల్సి వస్తుంది.