మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ కి తెలుగులో స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించిన మలయాళ చిత్రాలను ఓటీటీలో వీక్షించేందుకు తెగ ఆత్రుత చూపిస్తారు. పృథ్వీ రాజ్ సుకుమారన్ ని నటుడిగానే కాదు దర్శకుడిగానూ తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. లూసిఫర్, జన గణ మన, బ్రో డాడి లాంటి చిత్రాలే కాదు సలార్ లో విలన్ గా కనిపించిన ఆయన మహేష్-రాజమౌళి చిత్రంలో కీ రోల్ లో కనిపించబోతున్నారు.
పూథ్వీరాజ్ సుకుమారన్ పై తెలుగులు ప్రేక్షకులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు అంటే.. లూసిఫర్ కి సీక్వెల్ గా వచ్చిన లూసిఫర్ 2 కోసం ప్రేక్షకులు చాలా ఎదురు చూసారు. L 2 ఎంపురాన్ గా పాన్ ఇండియా మార్కెట్ లోకి వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో తెలుగు ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేసింది.
అప్పట్లో లూసిఫర్ ఎంత పెద్ద హిట్టో.. దానికి సీక్వెల్ గా వచ్చిన L 2 ఎంపురాన్ దాని దారిదాపుల్లో కూడా లేదు, కేరళ రాజకీయాలపై సినిమా ఉంటుంది అనుకుంటే మోహన్ లాల్ ఎలివేషన్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే సినిమా తీసినట్టు ఉంది అంటున్నారు చూసినవాళ్లు. నిన్న గురువారం నుంచి జియో ప్లస్ హాట్ స్టార్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాగా.. ఓటీటీ లో L 2ని చూసి ఇంత డిజప్పాయింట్ చేసావేమిటి పృథ్వీ అంటూ కామెంట్లు పెడుతున్నారు తెలుగు ఆడియన్స్.
ఈ చిత్రంలో మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ కీ రోల్ నటించి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మలయాళీలకు నచ్చినా తెలుగు ప్రేక్షకులకు ఎక్కలేదు, ఇప్పుడు ఓటీటీలో వీక్షించిన వారు కూడా నిరాశపడిపోతూ ట్వీట్లు పెడుతున్నారు.