చరిత్ర లో రామాయణ, మహాభారతాల్లో ఆడదాని వలన రాజ్యాలే కుప్పకూలాయంటే నిజంగా ఏమిటో అనుకున్నాం. అవి చదవడం, వినడమే కానీ ఇప్పటివరకు అలాంటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసింది లేదు. కానీ ఇప్పుడు అలాంటి కథనే ప్రత్యక్షం గా చూస్తున్నాం అంటూ ఏపీ ప్రజలు మాట్లాడుకోవడం గమనార్హం.
జగన్ ప్రభుత్వంలో భార్య వాణి సహాయంతో ఎమ్యెల్సీగా గెలుపొంది ఆతర్వాత దివ్వెల మధురితో సన్నిహిత సంబంధాలతో భార్య వాణి ని ఆమె పిల్లలను గాలికి కాదు రోడ్డున పడేసిన దువ్వాడ శ్రీనివాస్ కి ఇప్పుడు ఆ ఎమ్యెల్సీ పదవి పోయేలా ఉంది. అటు వైసీపీ పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేసారు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం ఇలా అవడానికి కారణం దివ్వెల మాధురి అనే ఆయన అభిమానులు మాట్లాడుకోవడం గమనార్హం.
భార్య వాణి ని, కూతుళ్లను రోడ్డుపాలు చేసి దువ్వాడ, దివ్వెల మాధురి తో కలిసి 60 ఏళ్ళ వయసులో కొత్త జంటలా తిరగడం పార్టీ పరువు పోయేలా చేసింది, మాధురి తో కలిసి తిరుమల దగ్గర నుంచి రీల్స్ వరకు, షాప్ ఓపెనింగ్స్ దగ్గర నుంచి ఇంటర్వూస్ వరకు వారు కనిపిస్తున్న తీరు తో పార్టీ పరువుపోతుంది అని భావించే కాదు.. ఓ ఇంటర్వ్యూలో నారా లోకేష్ ని మాధురి తో కలిసి దువ్వాడ పొగడడం కూడా అతని సస్పెన్షన్ కి కారణమైంది అంటున్నారు.
దివ్వెల మాధురితో కలిసి ఇంటి కరెంట్ బిల్ కట్టకుండా అదేమిటని అడిగిన ఏఈ ని బూతులు తిట్టిన దువ్వాడ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మధురితో కలిసి అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం అన్ని దువ్వాడ ని పార్టీకి దూరం చేసాయి. ఇలా దువ్వాడ బ్లేమ్ అయిన ప్రతి విషయంలో మాధురి ఆయన వెనుకే ఉంది. మాధురితో సాన్నిహిత్యమే దువ్వాడకు ఈ గతి పట్టేలా చేసాయి అంటూ ఏపీ ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.